అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆర్‌బీఐ రెపో యథాతథ స్థితికే మొగ్గుచూపింది. కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్‌బీఐ బుధవారం ప్రకటించింది. మంగళ, బుధవారాల్లో జరిగిన
అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆర్‌బీఐ యథాతథ స్థితికే మొగ్గుచూపింది. కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్‌బీఐ బుధవారం ప్రకటించింది. మంగళ, బుధవారాల్లో జరిగిన పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

రెపో రేటు 6.25శాతాన్ని ఆర్‌బీఐ అలాగే ఉంచింది. నాలుగో త్రైమాసికం నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 5శాతం ఉంటుందని కమిటీ అంచనా వేసింది. 2016-17లో వృద్ధిరేటును 7.6 నుంచి 7.1 శాతానికి తగ్గించి అంచనాలను మార్చారు. రెపో రేటు అంటే ఆర్బీఐ బ్యాంకులకు డబ్బు ఇచ్చేందుకు వసూలు చేసే వడ్డీ రేటు.పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రూ.11.55 లక్షల కోట్ల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర బ్యాంకు తెలిపింది. కొత్త నోట్ల జారీలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు మార్గాలు
ఆర్‌బీఐ సమీక్షలోని ముఖ్యాంశాలు
* రెపోరేటు: 6.25% ; రివర్స్ రెపో రేటు : 5.75%
* సీఆర్ఆర్ (నగదు నిల్వల నిష్పత్తి) : 4%
* వృద్ది రేటు అంచనాల తగ్గింపు: 7.6% నుంచి 7.1%(2016-17)
* ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ లక్ష్యం: 5%
ఇది కూడా చదవండి ప్రపంచంలో టాప్-10 మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలివే...
నవంబరు 8న కేంద్రం రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ తన ద్రవ్య పరపతి సమీక్షలో రెపో రేటును కనీసం 25 బేసిస్ పాయింట్లు కోత విధిస్తుందని భావించారు. బ్యాంకర్లతో పాటు చాలా సంస్థలు ఇదే విధంగా ఊహించాయి. అంచనాలను తల్లకిందులు చేస్తూ రెపోరేటును 6.25% వద్దే ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటించారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications