నోట్ల రద్దు నిర్ణయం ప్రముఖ మొబైల్ సంస్థ యాపిల్ కు బాగా కలిసొచ్చింది. విక్రయాలను పెంచుకోవడానికి మల్లగుల్లాలు పడుతున్న యాపిల్‌కు ఈ అనూహ్య నిర్ణయం లాభించింది. రూ.500, రూ.1000 చలామణిని కేంద్రం రద్దు చ
నోట్ల రద్దు నిర్ణయం ప్రముఖ మొబైల్ సంస్థ యాపిల్ కు బాగా కలిసొచ్చింది. విక్రయాలను పెంచుకోవడానికి మల్లగుల్లాలు పడుతున్న యాపిల్‌కు ఈ అనూహ్య నిర్ణయం లాభించింది. రూ.500, రూ.1000 చలామణిని కేంద్రం రద్దు చేయడంతో ఐ ఫోన్లను కొనేందుకు వాటిని ఉపయోగించేందుకు జనాలు మొగ్గుచూపుతున్నారు. దీంతో భారతదేశంలో మిలియన్ ఐ ఫోన్ల్ అమ్మాలనే టార్గెట్ వైపు వేగంగా దూసుకుపోతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత మరో మార్గంలో (పాత తేదీ రసీదులతో) ఐఫోన్ అమ్మకాలు ఊపందుకున్నాయి కేవలం మూడు రోజుల్లో లక్ష ఖరీదైన ఐ ఫోన్లను అమ్మినట్టు తెలుస్తోంది. ఇది నెల వారీ అమ్మకాల సగటులో నాలుగు రెట్లు అధికమని మొబైల్ మార్కెట్ విశ్లేషకులు చెపుతున్నారు.
యాపిల్ ఫోన్ల అమ్మకాలు
హాంకాంగ్‌కు చెందిన కౌంటర్‌పాయింట్ టెక్నాలజీ మొత్తం ఫోన్ల అమ్మకాలపై జరిపిన అధ్యయనంలో ఈ రకమైన ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి అనేక దుకాణాల్లో ఐఫోన్ విక్రయాలు జోరందుకున్నట్టు ఢిల్లీలో ఒక ప్రముఖ మొబైల్ దుకాణం యజమాని వెల్లడించారు. రద్దయిన కరెన్సీ నోట్ల ద్వారా ఖరీదైన హ్యాండ్సెట్లు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు మొగ్గుచూపుతున్నట్లు తెలిపారు. నిజానికి ప్రీమియం రేటుతో (అసలు ధర కంటే ఎక్కువకు) ఈ కొనుగోళ్ల లావాదేవీలు జరిగినట్లు చెప్పారు.