రిలయన్స్ జియో ఉచిత సేవలు మార్చి31 వరకూ పొడిగింపు
రిలయన్స్ జియో ఉచిత వాయిస్ కాల్స్, డేటా సేవలను మార్చి 31 వరకూ పొడిగించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ చెప్పారు. ఉద్యోగులు, వాటాదార్లతో జరిగిన సమావేశంలో పలు
రిలయన్స్ జియో ఉచిత వాయిస్ కాల్స్, డేటా సేవలను మార్చి 31 వరకూ పొడిగించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ చెప్పారు. ఉద్యోగులు, వాటాదార్లతో జరిగిన సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు.

1. ఇతర నెట్‌వర్క్‌ల కంటే జియో వినియోగదారు 25 రెట్లు ఎక్కువ డేటాను వాడగలుగుతున్నారు.
2. డిసెంబరు 4 నుంచి జియో వినియోగదార్లకు జియో డేటా, వాయిస్, వీడియో సేవలు మార్చి 31 వరకూ ఉచితంగా అందేలా నిర్ణయించారు.
3. ప్రస్తుతం టెలికాం ఆపరేటర్ల నుంచి ఆశించినంత మద్దతు లేదు. మూడు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ల నుంచి 900 కోట్ల వాయిస్ కాల్స్‌కు అంతరాయం ఏర్పడింది. వాటన్నింటినీ సదరు టెలికాం సంస్థలు బ్లాక్ చేస్తున్నాయి.
4. గత మూడు నెలల్లో సగటున ప్రతి రోజు 6 లక్షల మంది జియో కనెక్షన్ తీసుకున్నారు.
దీంతో జియో నెట్‌వర్క్ 5 కోట్ల మైలురాయిని చేరుకుంది.
5.వెల్‌కమ్ ఆఫర్ నుంచి జియో వినియోగదార్లు ప్రయోజనం పొందుతున్నారు.
6. దేశవ్యాప్తంగా 2 లక్షల అవుట్‌లెట్లలో ఈ-కేవైసీ ఆధారిత సిమ్ యాక్టివేషన్ జరుగుతోంది. ఇది మార్చి,2017 నాటికి 4 లక్షల అవుట్‌లెట్లకు విస్తరిస్తుంది.
7. ఈ మధ్యే ఇంటికే జియో సిమ్‌లు అందించే విధానాన్ని ప్రవేశపెట్టాం.
8. మొదటి మూడునెలల్లో జియో ఫేస్‌బుక్, వాట్సప్, స్కైప్‌ల కంటే వేగంగా విస్తరించింది.
ఇది కూడా చదవండి ఆరోగ్య బీమా పాలసీని తీసుకునేముందు వీటిని తెలుసుకోండి
Read in English: Free Voice, Data Till March 31 For Jio Users: Mukesh Ambani


Click it and Unblock the Notifications