30,000 మందిని తొల‌గించ‌నున్న‌ ఫోక్స్‌వ్యాగన్‌

కంపెనీ ఉద్గార విషయాల్లో మోసం చేసి ప్రపంచం దృష్టిని ఒక్క‌సారిగా ఫోక్స్‌వాగ‌న్ ఎంత‌లా ఆకర్షించిందో చాలా మంది మ‌రిచిపోలేరు. ప్ర‌స్తుతం ఆసంస్థ‌ చేపట్టిన మ‌రో చర్య కూడా అదే స్థాయిలో ఉంది. దాదాపు 30,000

కంపెనీ ఉద్గార విషయాల్లో మోసం చేసి ప్రపంచం దృష్టిని ఒక్క‌సారిగా ఫోక్స్‌వాగ‌న్ ఎంత‌లా ఆకర్షించిందో చాలా మంది మ‌రిచిపోలేరు. ప్ర‌స్తుతం ఆసంస్థ‌ చేపట్టిన మ‌రో చర్య కూడా అదే స్థాయిలో ఉంది. దాదాపు 30,000 మంది సిబ్బందిని ఆ కంపెనీ తొల‌గించ‌నుంద‌ని స‌మాచారం. నెలల తరబడి జరిగిన ఆవేదనాభరిత చర్చల అనంతరం సిబ్బందికి చెందిన ప్రతినిధులు ఈ ఒప్పందానికి అంగీకరించారు.

30,000 మందిని తొల‌గించ‌నున్న‌ ఫోక్స్‌వ్యాగన్‌

ఈ ఉద్యోగాల కోత నేపథ్యంలో 2020 కల్లా ఏటా 3.7 బిలియన్‌ యూరోలు(3.9 బిలియన్‌ డాలర్లు) కంపెనీకి ఆదా అవుతాయని.. విద్యుత్‌ వాహనాల్లో పెట్టుబడులు పెంచుకోవడానికీ వీలు కలుగుతుందని ఫోక్స్‌వ్యాగన్‌ బ్రాండ్‌ అధిపతి హెర్బర్ట్‌ డీజ్‌ పేర్కొన్నారు. కాగా, తొలగించబోయే సిబ్బంది అంతా ఫోక్స్‌వ్యాగన్‌ సొంత బ్రాండ్‌లోనివారే. పోర్సె, ఆడి, స్కోడా వంటి గ్రూపు ఇతర బ్రాండ్లపై ఈ ప్రభావం ఉండబోదు. ఒక్క జర్మనీలోనే 23,000 మందిని తొలగించనున్నారు. 'బాధాకరమైన తప్పట్లేదు. మూలాల్లోని సమస్యలను పరిష్కరించాలంటే ఈ వేటు వేయాల్సిందే. మేం ఈ పనిచేయలేమని చాలా మంది అనుకున్నారు. ఫోక్స్‌వ్యాగన్‌ ఆ పనిచేయగలదని.. మార్పునకు సిద్ధంగా ఉంటుందని ఇవాళ మేం నిరూపించామ'ని డీజ్ మీడియాతో అన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+