పని మొదలుపెట్టిన ఆదాయపు పన్ను శాఖ
నల్లధనంపై దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించే అత్యంత కీలక నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన పది రోజుల్లోనే ఆదాయ పన్ను శాఖ భారీ నగదు లావాదేవీలపై నోటీసులు జారీ చేసింది.
నల్లధనంపై దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించే అత్యంత కీలక నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన పది రోజుల్లోనే ఆదాయ పన్ను శాఖ భారీ నగదు లావాదేవీలపై నోటీసులు జారీ చేసింది. నవంబరు 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రద్దు చేసిన నోట్లను తక్కువ మొత్తంలోనే మార్పు చేసుకోవడానికి అవకాశం ఉండటంతో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడానికి రూ. 2.5 లక్షలకు పైగా డబ్బును బ్యాంకులో జమ చేసిన ఖాతాలపై ఆదాయ పన్ను శాఖ గురి పెట్టింది. పెద్ద నోట్ల రద్దుతో ఖాతాల్లో భారీ నగదు లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ బ్యాంకుల నుంచి ఎప్పటికప్పుడు నివేధికలు తెప్పిస్తూనే ఉంది.

దీనిలో భాగంగానే సిక్కింలోని గ్యాంగ్‌టలోని సీతారామ్ ఎంటర్ ప్రైజెస్‌కు ఆదాయ పన్ను శాఖ శుక్రవారం నోటీసు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ సిక్కింకు చెందిన సితారామ్ ఎంటర్ ప్రైజెస్ ఖాతాలో నవంబర్ 12 నుంచి 14 మధ్య జరిపిన లావాదేవీలపై ఈ నెల 25న వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొంది. నవంబర్ 13న సదరు కంపెనీ బ్యాంకు ఖాతాలో 4,51,000 రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఈ నగదు లావాదేవీలకు సంబంధించి ఆధారాలు సమర్పించవల్సిందిగా సిలిగురి ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆదాయపన్ను చెల్లించినట్టయితే దానికి సంబందించి నఖలును సమర్పించాలని నోటీసులో పేర్కొంది.
More From GoodReturns

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్‌పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!



Click it and Unblock the Notifications