దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో నియామకాలు భారీగా తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో దేశంలోని నాలుగు అగ్రశ్రేణి సాఫ్ట్వేర్ సంస్థల్లో నియామకాలు ఏకంగా 43 శాతం తగ్గినట్లు కొటక్ ఇ
దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో నియామకాలు భారీగా తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో దేశంలోని నాలుగు అగ్రశ్రేణి సాఫ్ట్వేర్ సంస్థల్లో నియామకాలు ఏకంగా 43 శాతం తగ్గినట్లు కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక వెల్లడించింది. ఈ కంపెనీల పనితీరు నిరాశజనకంగా ఉండటంతో పాటు మందగమనంలోకి జారుకోవటంతో నియామకాలు భారీగా తగ్గాయని పేర్కొంది.

సెప్టెంబరు త్రైమాసికంలో ఈ నాలుగు కంపెనీలు కేవలం 14,421 మందిని మాత్రమే నియమించుకున్నాయని కొటక్ నివేదిక తెలిపింది. గత ఏడాదితో పోల్చితే ఇది 43 శాతం తక్కువని పేర్కొంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఈ కంపెనీల్లో నియామకాలు 24 శాతం తగ్గుదలతో 29,686గా ఉన్నాయని వెల్లడించింది. ఉత్పాదకతను పెంచుకోవటంపై దృష్టిపెట్టటంతో పాటు వృద్ధి ఆశించిన స్థాయిల్లో ఉండకపోవటం వంటి అంశాలు నియామకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయని కోటక్ పేర్కొంది. కాగా ద్వితీయ త్రైమాసికంలో సాఫ్ట్వేర్ కంపెనీల ఫలితాలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని, సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా లేకపోవటంతో పనితీరుపై ప్రభావం పడిందని నివేదిక వెల్లడించింది. టెలికాం విభాగం మినహా ఇతర అన్ని విభాగాల పనితీరుపై ఈ ప్రభావం కనిపించిందని వివరించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications