ఆన్‌లైన్ పీపీఎఫ్ సౌక‌ర్యాన్ని అందిస్తున్న బ్యాంకులు

చాలా బ్యాంకులు ఆన్‌లైన్ పీపీఎఫ్ ఖాతా తెరిచే, డ‌బ్బు బ‌దిలీ చేసే స‌దుపాయాన్ని ప్రారంభించాయి. అందులో కొన్ని మీ కోసం

మీరు పీపీఎఫ్ ఖాతాను తెరిచేందుకు చాలా ప్ర‌యాస‌ప‌డ్డారా? అవును ఎంతో స‌మ‌యం వెచ్చించి బ్యాంకు శాఖ‌కు వెళ్లి చాలా మంది కష్ట‌ప‌డే ఉంటారు. మ‌ళ్లీ క‌నీసం డ‌బ్బు చెల్లింపున‌కు అయినా ఆన్‌లైన్‌లో సౌక‌ర్య‌వంతంగా ఉంటే ప‌ర్వాలేదు. ఇప్పుడు ఆ బ్యాంకుతో విసుగుచెందుతున్నారా. అయితే ఇది మీ కోస‌మే. చాలా బ్యాంకులు ఆన్‌లైన్ పీపీఎఫ్ ఖాతా తెరిచే, డ‌బ్బు బ‌దిలీ చేసే స‌దుపాయాన్ని ప్రారంభించాయి. అందులో కొన్ని మీ కోసం
ఇది కూడా చ‌ద‌వండి పీపీఎఫ్‌పై రుణం తీసుకుంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి
ఎస్‌బీఐ
దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా ఉన్న ఎస్‌బీఐ సాంకేతిక‌ప‌రంగా ఎప్పుడూ అప్‌గ్రేడ్ అవుతూనే ఉంటుంది. ఈ బ్యాంకులో మీరు ఆన్‌లైన్‌లోనే డ‌బ్బులు చెల్లించేందుకు అవ‌కాశం ఉంది. పీపీఎఫ్ ఖాతాకు ఏ బ్యాంకు నుంచ‌యినా డ‌బ్బులు బ‌దిలీ చేయ‌వ‌చ్చు. అయితే ఎస్‌బీఐలో పీపీఎఫ్ ఖాతాను తెర‌వ‌లేక‌పోవ‌డం ప్ర‌తికూల‌త‌.

PPF onlline

కెన‌రా బ్యాంకు
కెన‌రా బ్యాంకు ఖాతాదార్లు పీపీఎఫ్ ఖాతాను ఆన్‌లైన్‌లో తెరిచి, న‌గ‌దు బ‌దిలీల‌ను సైతం ఆన్‌లైన్‌లో చేప‌ట్ట‌వ‌చ్చు. స్టేట్‌మెంట్‌ను సైతం లాగిన్ అయి చూసుకోవ‌చ్చు. టెక్నాల‌జీ ప‌రంగా అధునాత‌న సౌక‌ర్యాల‌ను ఈ బ్యాంకు అందిస్తోంది

ఐసీఐసీఐ బ్యాంకు
మీకు ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉన్నా, వేరే ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా మీరు ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న పీపీఎఫ్ ఖాతాలోకి ఫండ్‌ట్రాన్స్‌ఫ‌ర్ ఆన్‌లైన్‌లో చేప‌ట్ట‌వ‌చ్చు. ఖాతా తెరిచేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఫారం, నామినీ ఫారం ఐసీఐసీఐ బ్యాంకు వెబ్‌సైట్‌లో ల‌భించ‌డం సానుకూలాంశం.

యాక్సిస్ బ్యాంకు
యాక్సిస్ బ్యాంకు ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్‌ను ఆన్‌లైన్‌లో చేసుకునే వీలును క‌ల్పిస్తోంది. అయితే కొన్ని శాఖ‌లు మాత్ర‌మే పీపీఎఫ్ ఖాతాను తెరిచే సౌక‌ర్యం క‌లిగి ఉన్నాయి. మీకు ద‌గ్గ‌ర్లో ఉన్న బ్యాంకు శాఖ‌లో పీపీఎఫ్ ఖాతా తెరిచే స‌దుపాయం లేక‌పోతే మొద‌టి సారి అధీకృత బ్యాంకు శాఖ‌లో ఖాతాను తెరిచి త‌దుప‌రి లావాదేవీల‌ను ఆన్‌లైన్‌లో చేసుకోవ‌చ్చు.

పీపీఎఫ్ ట్రాన్స్‌ఫ‌ర్ ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు వీలున్న బ్యాంకులు

* స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌

* ఐడీబీఐ బ్యాంక్‌

* సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
* బ్యాంక్ ఆఫ్ ఇండియా
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ప‌టియాలా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+