భారత్‌లో సాఫ్ట్‌వేర్ విప్లవం తర్వాత ఈ నగరాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి సాఫ్ట్‌వేర్ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ వస్తున్నాయి. దాదాపు ప్రప
కర్ణాటక రాజధాని అయిన బెంగుళూరు దేశంలో ఐదో అతిపెద్ద నగరం. కర్ణాటక జీడీపీలో సింహ భాగం బెంగుళూరు నుంచే వస్తోంది. దేశంలోని మొత్తం ఐటీ, ఐటీ సంబంధిత, బీపీవో ఉద్యోగుల్లో 30 నుంచి 35% మందికి ఈ నగరమే ఉపాధి కల్పిస్తోంది. ఐటీ రెవల్యూషన్ రాక ముందు దీన్ని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుచుకునేవారు. భారత్‌లో సాఫ్ట్‌వేర్ విప్లవం తర్వాత ఈ నగరాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి సాఫ్ట్‌వేర్ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ వస్తున్నాయి. దాదాపు ప్రపంచంలో ప్రసిద్దిగాంచిన సాఫ్ట్‌వేర్ సంస్థలన్నీ ఈ నగరంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఎన్నో స్టార్టప్‌లు సైతం ఇక్కడి నుంచి మొదలై విజయం సాధిస్తున్నాయి. ఎన్నో వేల సాఫ్ట్‌వేర్ సంస్థలున్నప్పటికీ అన్నీ విజయవంతం కాలేవు. ఈ నేపథ్యంలో ఈ నగరంలోని టాప్ 10 ఐటీ కంపెనీలపైన ఓ లుక్కేద్దాం.

1. విప్రో
బెంగుళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న విప్రో లెవల్ 5 కంపెనీ. అబిద్ అలీ నీమూచ్‌వాలా కంపెనీ సీఈవోగా ఉన్నారు. 1945లో చిన్న సంస్థగా మొదలైన విప్రో 1981 నుంచి ఐటీ కార్యకలాపాలను మొదలుపెట్టింది. 1990ల్లో ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. విప్రో ఉద్యోగుల సంఖ్య 1 లక్షా 70 వేలకు దగ్గరగా ఉంది. ప్రపంచంలో 6 ఖండాల్లో దీనికి విస్తరణ ఉంది. విప్రోను అజిమ్ ప్రేమ్‌జీ స్థాపించిన సంగతి తెలిసిందే.
రెవెన్యూ: రూ. 45096 కోట్లు
లాభం: రూ.8099 కోట్లు
విప్రో సేవలు అందించే రంగాలు
బీఎఫ్ఎస్ఐ
మ్యాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ
కమ్యూనికేషన్స్
కన్సూమర్ బిజినెస్ యూనిట్
ఇంధన, సహజ వనరులు, తత్సంబంధ సేవలు
హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్

2. ఇన్ఫోసిస్
దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్. బ్రాండ్ అవేర్‌నెస్‌లో మొట్టమొదటి స్థానంలో ఉంది. 1981లో ఇన్ఫోసిస్ చిన్న ఐటీ కంపెనీగా మొదలయింది. నారాయణ మూర్తి అతని సహచరులు దీన్ని స్థాపించారు. సంస్థ ఉద్యోగులు దాదాపు 1.94 లక్షల వరకూ ఉన్నారు. బెంగుళూరు ప్రధాన కేంద్రంగా ఉంది. 40 పైగా దేశాల్లో సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి. 85కి పైగా సేల్స్, మార్కెటింగ్ కార్యాలయాలు కలిగిన ఇన్ఫీ, 100 డెవలప్‌మెంట్ సెంటర్లను కలిగి ఉంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా.
రెవెన్యూ: రూ. 65569 కోట్లు
లాభం: రూ. 18982 కోట్లు
ఇన్ఫోసిస్ సబ్సిడరీలు: ఇన్ఫోసిస్ బీపీవో, ఇన్ఫోసిస్ కన్సల్టింగ్, ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్, స్కవా, ఎడ్జ్‌వెర్వ్

3. యాక్సెంచర్
యాక్సెంచర్ 1913లో ప్రారంభమైంది. దీని కార్పొరేట్ కార్యాలయం ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్‌లో ఉంది. ఐటీ, బిజినెస్ కన్సల్టింగ్ అండ్ ఔట్‌సోర్సింగ్‌లో దీని కార్యకలాపాలు ఉన్నాయి. బెంగుళూరులోని టాప్5 కంపెనీల్లో ఇది చోటు దక్కించుకుంది. ఇది బహుళ జాతి కంపెనీ అయి ప్రధాన కార్యాలయం వేరే దేశంలో ఉన్నప్పటికీ భారతదేశంలో ముంబయిలో దీని కార్యకలాపాలు 1987 నుంచి మొదలయ్యాయి.

4. ఐబీఎమ్
ఐబీఎమ్ సంస్థకు 170కి పైగా దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. బెంగుళూరు, హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఐబీఎమ్‌కు కార్యాలయాలు కలిగి ఉంది. టెక్నాలజీతో పాటు కన్సల్టింగ్‌లో సైతం ఐబీఎమ్ ప్రముఖంగా ఉంది. 1992లో ఇండియాలో ఈ కంపెనీ తన ప్రాజెక్టులను మొదలుపెట్టింది. ఫైనాన్సియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, ప్రభుత్వ ప్రాజెక్టులు, ఆటోమోటివ్, టెలికమ్యూనికేషన్స్, విద్యా రంగం(ఎడ్యుకేషన్) రంగాల్లో ఐబీఎమ్ ప్రధానంగా తన ప్రాజెక్టులను చేపడుతోంది.

5. కాంపాక్
1992లో స్థాపించిన కాంపాక్ ప్రధాన కార్యాలయం యూఎస్‌లోని టెక్సాస్‌లో ఉంది. ఐటీ కన్సల్టింగ్, ఐటీ సేవలు, కంప్యూటర్ హార్డ్‌వేర్ రంగాల్లో దీనికి వ్యాపార విస్తరణ ఉంది. 2002లో హెచ్‌పీ దీన్ని స్వాధీనం చేసుకుంది. కాంపాక్ కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను తయారుచేయడంతో పాటు ఐటీ సేవలను, సాఫ్ట్‌వేర్ అనుబంధ సేవలను అందిస్తోంది.

6. లింక్ సాఫ్ట్‌వేర్
లింక్ సాఫ్ట్‌వేర్ 1988లో మొదలైంది. దీని కార్పొరేట్ కార్యాలయం బెంగుళూరులో ఉంది. ఐటీ సేవల్లో వివిధ వ్యాపారాలను చేపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా క్లైంట్లను కలిగి ఉంది. ఆసియా, అమెరికా, యూరప్, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో చాలా చోట్ల కార్యాలయాలు ఉన్నాయి.
Website - lincsoftware.com

7. ఒరాకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
1977లో ప్రారంభమైన ఒరాకిల్ ఇండియా కార్పొరేట్ కార్యాలయం హర్యానాలోని గుర్గావ్‌లో ఉంది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండింటిలో పలు వ్యాపార కార్యకలాపాలను చేస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ సంస్థ 1977లో స్థాపించబడింది. మార్కెటింగ్, డీబీఎంఎస్, ఆర్గనైజేషన్ బేస్‌డ్ సాప్ట్‌వేర్ ఒరాకిల్ ప్రత్యేకతలు.

8. జెనిత్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్
1996లో ప్రారంభమైన ఈ కంపెనీ కార్పొరేట్ కార్యాలయం బెంగుళూరులో ఉంది. ఐటీ సేవలు, ఔట్‌సోర్సింగ్ దీని ప్రధాన వ్యాపారాలు. భారత్‌లోనూ, విదేశాల్లోనూ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్లను అందిస్తుంది. దీని ఐటీ సేవల్లో బీఐ(బిజినెస్ ఇంటెలిజెన్స్), డేటా వేర్‌హౌసింగ్, కస్టమ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ వంటివి ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, అప్లికేషన్ మేనేజ్‌మెంట్ సేవలు, ప్యాకేజీ అప్లికేషన్లను అందించడంలోనూ ప్రవేశం ఉంది. ఐఎస్‌వో 9001:2008 సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

9. శ్యాప్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
బెంగుళూరులో కార్పొరేట్ కార్యాలయం కలిగిన శ్యాప్ 1996లో స్థాపించబడింది. సాఫ్ట్‌వేర్ సొల్యూషన్లను అందించడం ప్రధాన వ్యాపారం. బెంగూళూరుల్లో టాప్ కంపెనీల్లో ఒకటిగా ఇది నిలిచింది. శ్యాప్ ఏజీ అనుబంధ సంస్థగా శ్యాప్ ల్యాబ్స్ ఇండియా ఉంది. రీసెర్చి, డిజైనింగ్, సాప్ట్‌వేర్ అప్లికేషన్లను అభివృద్ది పరచడంలో కంపెనీ ప్రావీణ్యం కలిగి ఉంది. ఉద్యోగులు పనిచేయడానికి ఉత్తమమైన కంపెనీల్లో రెండో స్థానంలోనూ, ఐటీ రంగంలో రెండో ఉత్తమ కంపెనీగానూ శ్యాప్ ర్యాంక్ సాధించింది.

10. సింటెల్ ఇండియా లిమిటెడ్
1980ల్లో ప్రారంభమైన సింటెల్ కార్పొరేట్ కార్యాలయం అమెరికాలోని మిచిగన్‌లో ఉంది. ఐటీ కన్సల్టింగ్, ఐటీ ఔట్‌సోర్సింగ్, బీపీవో, అప్లికేషన్ డెవలప్‌మెంట్‌ల్లో తన సేవలను అందిస్తోంది. అప్లికేషన్ మేనేజ్‌మెంట్, ఆర్కిటెక్చర్ సొల్యూషన్స్, బిజినెస్ అనలిటిక్స్‌లలో సైతం ప్రవేశం ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్‌ప్రైజెస్ బిజినెస్ సొల్యూషన్లను అందించడంలో శ్యాప్ మంచి పేరు సంపాదించింది.


Click it and Unblock the Notifications