భార‌త్ కంటే పాకిస్థాన్ వెనుక‌బ‌డిన సామాజిక‌-ఆర్థిక అంశాలు

నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద ఉద్రిక ప‌రిస్థితుల దృష్ట్యా రెండు దేశాల మ‌ధ్య ప‌రిస్థితి చాలా ఆందోళ‌న‌క‌రంగా ఉంది. మరోవైపు పాకిస్థాన్ దూకుడుగా నిర్ణ‌యం తీసుకోవాలంటే వారికి చాలా అంశాలు అడ్డు వ‌స్తున్నాయి. చాలా అంశాల్లో మ‌న‌కు స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ కొన్ని అంశాల్లో మాత్రం భార‌త్ కంటే చాలా దీన ప‌రిస్థితిలో ఆ దేశం ఉంది. పేద‌రికం, నిర‌క్ష‌రాస్య‌త‌, నిరుద్యోగం, పౌష్టికాహార లోపం, ఇంధ‌న లోటు వంటివి గ‌త కొన్నేళ్లుగా పాకిస్థాన్‌కు చాలా ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మించాయి. ఒక ఆర్థిక అంశాలే కాదు హెల్త్ కేర్ స‌ర్వీసెస్‌, త‌క్కువ అక్ష‌రాస్య‌త రేటు, అధిక శిశుమ‌ర‌ణాల రేటు వంటి వాటిని పాక్ స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించుకోవాల్సి ఉంది. స‌రిహ‌ద్దుల వ‌ద్ద మ‌న‌కు ఇబ్బందులు సృష్టించేందుకు బ‌దులుగా పాక్ ఈ కింది అంశాల‌పై దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ఏయే అంశాల్లో ఇరు దేశాలు ఏ విధంగా ఉన్నాయో ఒక‌సారి చూద్దాం.

1. త‌క్కువ ఆర్థిక వృద్ది (వృద్ది రేటు)

1. త‌క్కువ ఆర్థిక వృద్ది (వృద్ది రేటు)

భార‌తదేశ జీడీపీ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. 2.07 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌ వ‌ద్ద భార‌త జీడీపీ అభివృద్ది చెందిన దేశాల స‌ర‌స‌న నిలుస్తోంది. మ‌రో వైపు పాక్ జీడీపీ చూస్తే 270 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. పాక్ జీడీపీ ప్ర‌పంచంలో 41 వ ర్యాంకు క‌లిగి ఉంది. ఇండియా జీడీపీ వృద్ది రేటు 7.5% కి పైగా ఉండ‌గా పాక్ జీడీపీ వృద్ది రేటు 5.54%గా ఉంది. త‌క్కువ ఎఫ్‌డీఐ(విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు), అధిక అప్పులు, త‌ప్పుల త‌డ‌క‌గా ఉన్న ప‌న్ను వ్య‌వ‌స్థ‌, త‌క్కువ ఎగుమ‌తులు వంటివి పాకిస్థాన్‌కు తీవ్ర‌మైన స‌మ‌స్య‌లుగా ఉన్నాయి . వ్య‌వ‌సాయ రంగంలో చూస్తే చాలా పంట‌ల్లో ఉత్ప‌త్తి త‌గ్గుద‌ల వారికి చాలా ప్ర‌తికూలాంశం. ప‌త్తి ఉత్ప‌త్తిలో 31%, బియ్యం ఉత్ప‌త్తిలో 1.5% త‌గ్గుద‌ల‌, నూనె గింజ‌ల ఉత్ప‌త్తిలో 31% త‌గ్గుదల సంభ‌వించింది.

2. అధిక నిరుద్యోగిత

2. అధిక నిరుద్యోగిత

2014లో పాకిస్థాన్ దేశంలో నిరుద్యోగిత రేటు 5.2% ఉండ‌గా భార‌త్‌లో 3.6% గా ఉంది. ఇది ప్ర‌పంచ బ్యాంకు లెక్క‌ల ప్ర‌కారం. వ‌ర‌ల్డ్ బ్యాంకు లెక్క‌ల‌ కంటే అది ఇంకా ఎక్కువ‌గా ఉండ‌గ‌ల‌ద‌ని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ పాల‌సీ రిఫార్మ్(ఐపీఆర్‌) అభిప్రాయ‌ప‌డింది. "నిరుద్యోగిత 6 శాతం కంటే కొంచెం త‌క్కువ ఉంది. 2012-13 కంటే ఇది కొద్దిగా త‌గ్గింది. స‌రిగా లెక్క‌లు తీస్తే నిరుద్యోగిత రేటు 8.5% గా ఉండ‌గ‌ల‌దు. గ‌త 13 ఏళ్ల‌లో ఇది అత్య‌ధికం" అని పాక్ ఐపీఆర్ ఒక నివేదిక‌లో తెలిపింది.

3. ఇంధ‌న(విద్యుత్‌) సంక్షోభం

3. ఇంధ‌న(విద్యుత్‌) సంక్షోభం

పాక్‌లో విద్యుత్ ఉత్ప‌త్తిలో విప‌రీత‌మైన లోటు కార‌ణంగా త‌యారీ ప‌రిశ్ర‌మ చాలా ప్ర‌భావిత‌మ‌వుతోంది. త‌రుచూ ప‌వ‌ర్ కట్‌ల కార‌ణంగా అక్క‌డ‌ సామాన్యుడు సైతం ఇబ్బందులు ప‌డుతున్నాడు. మ‌రో వైపు మ‌న దేశంలో మారుమూల గ్రామ‌ల్లో ఇళ్ల‌కు సైతం విద్యుత్ ఇచ్చేందుకు న‌రేంద్ర మోదీ సార‌థ్యంలో ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. 2015-16లో 18452 విద్యుదీక‌ర‌ణ లేని గ్రామాల్లో 7108 గ్రామాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రాను అందించిన‌ట్లు కేంద్ర విద్యుత్ శాఖ లెక్క‌ల ప్ర‌కారం తెలుస్తోంది.

4. అక్ష‌రాస్య‌త‌

4. అక్ష‌రాస్య‌త‌

ప్ర‌పంచ బ్యాంకు లెక్క‌ల ప్ర‌కారం పెద్ద‌ల్లో అక్షరాస్య‌త రేటు భార‌త్‌లో(2011)లో 72.98% ఉండ‌గా, పాక్‌లో(2010) ఇది 55% గా ఉంది. పెద్ద‌ల్లో అక్ష‌రాస్య‌త రేటు కోసం 10 ఏళ్ల వ‌య‌సు పైబ‌డిన వారిని ప‌రిగ‌ణిస్తారు. పాకిస్థాన్ విద్యా శాఖ లెక్క‌ల ప్రకారం గ‌త ఐదేళ్ల‌లో పెద్ద‌ల్లో అక్ష‌రాస్య‌త రేటులో వృద్ది చాలా నెమ్మ‌దిగా 1శాతంగా ఉంద‌ని తెలుస్తోంది. దానికి కార‌ణాలుగా స‌రైన పాఠ‌శాల‌లు లేక‌పోవ‌డం, మూఢాచారాలు, లింగ వివక్ష‌త‌, త‌ల్లిదండ్రులు నిర‌క్ష‌రాస్యులుగా ఉండ‌టం వంటివి ఉన్నాయి.

5. పేద‌రికం

5. పేద‌రికం

పేద‌రికం అంశంలో పాకిస్థాన్‌తో పాటు భార‌త్ కూడా చాలా స‌మ‌స్య‌లను ఎదుర్కొంటోంది. అయితే ప్ర‌పంచ బ్యాంకు లెక్క‌ల ప్ర‌కారం పేద‌రికాన్ని త‌గ్గించ‌డంలో పాక్ కంటే మ‌నం కొంచెం ఉత్త‌మ స్థానంలో ఉన్నాం. ఇండియా, పాక్‌ల‌లో 2013లో పేద‌రికం 21.9 శాతం, 29.5%గా ఉన్న‌ట్లు ప్ర‌పంచ‌బ్యాంకు నివేదిక‌ల‌ను బ‌ట్టి తెలియ‌వ‌స్తోంది. భార‌త్‌లో పేద‌లు ఎక్కువ ఉన్న‌ప్ప‌టికీ మొత్తం జ‌నాభాలో పేదరిక శాతం అంత ఆందోళ‌న కరంగా లేద‌ని చెప్పాలి. పాకిస్థాన్‌లో కొత్త మెథ‌డాల‌జీ ప్రకారం దారిద్ర్య రేఖ‌కు దిగువ‌న 6 కోట్ల మంది ఉన్నారు.

ఎక్కువ మంది పేద‌లు ఉన్న దేశాల మొత్తంలో భార‌త్‌లోనే త‌క్కువ పేదరిక రేటు ఉన్న‌ట్లు ప్ర‌పంచ బ్యాంకు నివేదిక వెల్ల‌డించింది. శిశు మ‌ర‌ణాల రేటు విష‌యంలో పాక్ 81%తో చాలా వెనుక‌బ‌డి ఉండ‌గా భార‌త్‌లో ప‌రిస్థితి కాస్త మెరుగ్గా 48% గా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+