హైద‌రాబాద్‌లో 2016లో టాప్ 10 ఐటీ కంపెనీలు

నాస్కామ్ మొత్తం స‌భ్య కంపెనీల్లో 22% హైద‌ర‌బాద్ నుంచి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ప్రముఖ ఐటీ కంపెనీల గురించి తెలుసుకోవాల‌ని ఎవ‌రికి ఉండ‌దు? అందుకే హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖ ఐటీ కంపెనీల వివ‌రాల‌ను

సాఫ్ట్‌వేర్ ఎగుమ‌తుల్లో హైద‌ర‌బాద్ ప్ర‌ముఖ స్థానం క‌లిగి ఉంది. 2014లో ఈ ఎగుమ‌తుల విలువ 7 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా ఉంది. 2015-16 సంవ‌త్స‌రంలో ఐటీ ఎగుమ‌తుల విలువ 75 వేల కోట్ల రూపాయ‌ల‌ను దాటింది. ఐటీ ఎగుమ‌తుల్లో దేశ‌వ్యాప్తంగా క‌ర్ణాట‌క‌, తెలంగాణ మంచి పురోగ‌తిని క‌న‌బ‌రిచాయి. నాస్కామ్ మొత్తం స‌భ్య కంపెనీల్లో 22% హైద‌ర‌బాద్ నుంచి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ప్రముఖ ఐటీ కంపెనీల గురించి తెలుసుకోవాల‌ని ఎవ‌రికి ఉండ‌దు? అందుకే హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖ ఐటీ కంపెనీల వివ‌రాల‌ను చ‌దువుకోండి.

1. ఐబీఎమ్

1. ఐబీఎమ్

ఐబీఎమ్ సంస్థ‌కు 170కి పైగా దేశాల్లో కార్య‌క‌లాపాలు ఉన్నాయి. హైద‌రాబాద్‌తో పాటు దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఐబీఎమ్‌కు కార్యాల‌యాలు క‌లిగి ఉంది. టెక్నాల‌జీతో పాటు క‌న్స‌ల్టింగ్‌లో సైతం ఐబీఎమ్ ప్ర‌ముఖంగా ఉంది. 1992లో ఇండియాలో ఈ కంపెనీ త‌న ప్రాజెక్టుల‌ను మొద‌లుపెట్టింది. ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్‌, హెల్త్‌కేర్‌, ప్ర‌భుత్వ ప్రాజెక్టులు, ఆటోమోటివ్‌, టెలిక‌మ్యూనికేష‌న్స్, విద్యా రంగం(ఎడ్యుకేష‌న్‌) రంగాల్లో ఐబీఎమ్ ప్ర‌ధానంగా త‌న ప్రాజెక్టుల‌ను చేప‌డుతోంది. చెన్నైలో బంగారం ధ‌ర‌

హైద‌రాబాద్‌లో ఈ కంపెనీ చిరునామా:

Address: Survey No 64,AP 2C,Software Layout,Raheja IT

Park,HitechCity,Madhapur,Hyderabad,Andhra Pradesh,500081

2. ఇన్ఫోసిస్ టెక్నాల‌జీస్ లిమిటెడ్

2. ఇన్ఫోసిస్ టెక్నాల‌జీస్ లిమిటెడ్

భార‌త‌దేశ ఐటీ ప‌రిశ్ర‌మ‌లో ఇన్ఫోసిస్ ప్ర‌ముఖ‌మైన‌ది. 1981లో 7 మందితో ఈ సంస్థ ప్రారంభైమంది. ప్ర‌స్తుతం 1 ల‌క్షా యాభై వేల మందికి పైగా ఉద్యోగుల‌ను క‌లిగి ఉంది. 69 కార్యాల‌యాల్లో 87 డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ల‌లో ఈ సంస్థ ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. కంపెనీ ప్ర‌ధానంగా మేనేజ్‌మెంట్ క‌న్స‌ల్టింగ్‌, ఒరాకిల్ మ‌రియు శాప్‌ల్లో బిజినెస్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్‌, అప్లికేష‌న్ మేనేజ్‌మెంట్‌, ఇన్‌ఫ్రా మేనేజ్‌మెంట్‌, టెస్టింగ్‌, క్లౌడ్ కంప్యూటింగ్‌, ఎంట‌ర్‌ప్రైజ్ మొబిలిటీ, అప్లికేష‌న్ ఔట్‌సోర్సింగ్‌, ఇన్‌ఫ్రా అవుట్‌సోర్సింగ్‌, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్‌(బీపీఓ)ల్లో ప‌లు ప్రాజెక్టుల‌ను చేప‌డుతోంది.

ఈ కంపెనీ చిరునామా:

Address: Survey No. 210,Manikonda Village,Lingampally,Rangareddy (Dist.),

Hyderabad 500 032

3. టాటా క‌న్సల్టెన్సీ స‌ర్వీసెస్‌(టీసీఎస్‌)

3. టాటా క‌న్సల్టెన్సీ స‌ర్వీసెస్‌(టీసీఎస్‌)

టీసీఎస్ ఇండియాలోనే మొద‌టి స్థానంలో ఉన్న ఐటీ కంపెనీ. టాటా గ్రూపు సంస్థ నుంచి వ‌చ్చిన టీసీఎస్‌లో 2,76,0000 మంది ప‌నిచేస్తున్నారు. ఈ కంపెనీ 1995లో ప్రారంభ‌మైంది. ముంబ‌యిలో బంగారం ధ‌ర‌

ఈ కంపెనీ చిరునామా:

Address: SEZ Unit, Synergy Park,Premises2-56/1/36, Survey Number 26,CMC Campus, Gachibowli,Seri Lingampalli, RR District, Hyderabad- 50019

4. గూగుల్

4. గూగుల్

గూగుల్ సంస్థ‌కు భార‌త‌దేశంలో హైద‌రాబాద్‌, గుర్గావ్‌, ముంబ‌యి, బెంగుళూరుల్లో మాత్ర‌మే కార్యాల‌యాలు ఉన్నాయి. ఈ సంస్థ 1998లో ప్రారంభమైంది. 40కి పైగా దేశాల్లో 70కి పైగా కార్యాల‌యాలు ఉన్నాయి. ప్ర‌పంచంలో ప్ర‌ముఖ‌మైన సెర్చ్ ఇంజిన్‌ను క‌లిగిన గూగుల్ ఇంట‌ర్నెట్ సంబంధిత ఉత్ప‌త్తుల‌ను త‌యారుచేస్తుంది. దీంతో పాటు సెర్చింగ్‌, ఆన్‌లైన్ అడ్వ‌ర్టైజింగ్ టెక్నాల‌జీలు, క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్ట్‌వేర్ల‌లో ప్రాజెక్టుల‌ను ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ కంపెనీకి ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు యాడ్ వ‌ర్డ్స్‌. సెర్గీ బ్రిన్‌, లారీ పేజ్‌లు ఈ సంస్థ‌ను ప్రారంభించారు. ప్ర‌స్తుతం సుంద‌ర్ పిచై ఈ సంస్థ సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 2004లో ఇది ప‌బ్లిక్ ఇష్యూకు వ‌చ్చింది. 2015లో హోల్డింగ్ సంస్థ అల్పాబెట్‌ను ప్రారంభించింది.

ఈ కంపెనీ చిరునామా:

Address : Block 1, DivyaSree Omega, Survey No. 13,Kondapur Village, Hyderabad

5. సొనాటా సాఫ్ట్‌వేర్‌

5. సొనాటా సాఫ్ట్‌వేర్‌

సీఎమ్ఎమ్ లెవ‌ల్ 5 కంపెనీ అయిన ఈ సంస్థ 2800కు పైగా ఉద్యోగుల‌ను క‌లిగి ఉంది. యూఎస్‌, యూర‌ప్‌, మిడిల్ ఈస్ట్‌, ఇండియా, ఆసియా ప‌సిఫిక్ ప్రాంతాల్లో ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. క్లైంట్ల‌కు త‌క్కువ ఖ‌ర్చులో మంచి సేవ‌ల‌ను అందించే విధంగా ఈ సంస్థ ప‌నిచేస్తుంది. 2011లో గ్లోబ‌ల్ ఐటీ సేవ‌ల కంపెనీల్లో టాప్ 100లో ఈ సంస్థ చోటు ద‌క్కించుకుంది.

ఈ కంపెనీ చిరునామా:

Address: 1-10-176, Begumpet Main Road, Opp. Hyderabad Public School,

Hyderabad - 500 016, India న్యూఢిల్లీలో బంగారం ధ‌ర

6. జెన్సార్ టాక్నాల‌జీస్‌

6. జెన్సార్ టాక్నాల‌జీస్‌

ఐటీలో కెరీర్ మొద‌లుపెట్టేందుకు జెన్సార్ మంచి సంస్థ‌. ఇది లెవ‌ల్ 5 కంపెనీ. అమెరికా, యూర‌ప్‌, ఆఫ్రికా, మ‌ధ్య ఆసియా, సింగ‌పూర్‌, ఆస్ట్రేలియా, భార‌త‌దేశంలో ప‌లు క్లైంట్ల‌కు ఐటీ సేవ‌ల‌ను అందిస్తోంది. 20 ప్ర‌దేశాల్లో 7000 మంది అసోసియేట్ల‌ను క‌లిగి ఉంది.

ఈ కంపెనీ చిరునామా:

Address: 6th & 7th , Tower A, Ananth Info Park, Madhapur, Hyderabad

7. గ్రేప్‌సాఫ్ట్‌

7. గ్రేప్‌సాఫ్ట్‌

ఈ గ‌వ‌ర్నెన్స్‌, ఆఎఫ్ఐడీ, క్వాలిటీ మేనేజ్ వంటి వాటిల్లో ఈ కంపెనీ ప్రాజెక్టుల‌ను చేప‌డుతోంది. అప్లికేష‌న్ మేనేజ్‌మెంట్‌, ఓపీడీ సేవ‌లు, క్యూఏ సేవ‌లు, మెయింటెనెన్స్ స‌పోర్ట్‌, రీఇంజినీరింగ్ సేవ‌ల రంగాల్లో కంపెనీ త‌న సేవ‌ల‌ను అందిస్తోంది. ఈ సంస్థ ప్రధాన కార్యాల‌యం హైద‌రాబాద్లో ఉంది. మ‌రో కార్యాల‌యం కెన‌డాలో ఉంది.బెంగుళూరులో బంగారం ధ‌ర‌

ఈ కంపెనీ చిరునామా:

Address: 10-3-1/2, 2nd Floor,Gemini House,Mehdipatnam, Hyderabad - A.P.500028.

8. సీవ‌న్(C1) ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

8. సీవ‌న్(C1) ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

మొత్తం మీద ఈ-ప్రొక్యూర్‌మెంట్ సేవ‌ల‌న‌గానే ఈ సంస్థ పేరు క‌చ్చితంగా గుర్తొస్తోంది. 2000లో ప్రారంభ‌మైన ఈ కంపెనీ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించి మొట్ట‌మొద‌టి సంస్థ‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 10 ర‌కాల ప‌రిశ్ర‌మ‌ల‌కు వీరు సేవ‌లు అందిస్తున్నారు. 2005లో పీసీ క్వెస్ట్ నుంచి బెస్ట్ ఐటీ ఇంప్లిమెంటేష‌న్ అవార్డుతో పాటు నాస్కామ్ ఇండియా ఐటీ యూజర్ అవార్డును 2006లో అందుకుంది. 60 వేల‌కు పైగా ఈ-వేలాలు, 5ల‌క్ష‌ల‌కు పైగా ఈ-టెండ‌ర్ల‌ను ఈ సంస్థ పూర్తిచేసుకుంది.

9. సీఎమ్‌సీ లిమిటెడ్‌

9. సీఎమ్‌సీ లిమిటెడ్‌

సీఎమ్‌సీ లిమిటెడ్ 1975లో ప్రారంభమైంది. టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్‌కు ఇది స‌బ్సిడ‌రీ. అప్లికేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్‌, సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్లు, క్లౌడ్ సంబంధిత సేవ‌లు, మొబిలిటీ, అన‌లిటిక్స్‌, ఈఆర్‌పీ మొద‌లైన వాటిలో సంస్థ ప్రావీణ్యం క‌లిగి ఉంది. లెవ‌ల్ 5 కంపెనీ అయిన ఈ సంస్థ‌కు ఐఎస్‌వో 9001:2000 స‌ర్టిఫికేష‌న్ ఉంది. అంత‌ర్జాతీయంగా 11 చోట్ల డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్లు ఉన్నాయి.

10. సీఈఎస్ ప్రైవేట్ లిమిటెడ్

10. సీఈఎస్ ప్రైవేట్ లిమిటెడ్

ఈ సంస్థ 1985లో ప్రారంభమైంది. లెవ‌ల్ 3 కంపెనీ అయిన ఈ సంస్థ‌కు ఐఎస్‌వో 9001:2000 సర్టిఫికేష‌న్ ఉంది. ఒరాకిల్‌, అసెట్ మేనేజ్‌మెంట్, ఈ-కామ‌ర్స్ బీపీవో, హెల్త్‌కేర్‌, ప్రాడ‌క్ట్ ఇంజినీరింగ్‌, ఆర్‌పీవో, టెస్టింగ్ విభాగాల్లో కంపెనీ ప్రాజెక్టుల‌ను చేప‌డుతోంది. హైద‌రాబాద్‌లో బంగారం ధ‌ర‌

ఈ కంపెనీ చిరునామా:

Address:

7th Floor, Tower A, Ramky Selenium, Nanakramguda, Gachibowli

Hyderabad - 500032, India

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+