ఆటోమేషన్ కారణంగా భారతదేశంలో భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోనున్నట్టు ప్రపంచబ్యాంక్ హెచ్చరిస్తోంది. దాదాపు 69శాతం ఉద్యోగాలకు ఆటోమేషన్ కోతపెడుతుందని వరల్డ్ బ్యాంకు అబిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో టెక్నాలజీ సంప్రదాయ ఆర్థిక మార్గం నమూనాకు విఘాతం కలిగిస్తుందని ప్రపంచ బ్యాంకు పరిశోధనలో తేలింది. ఇక్కడ సంప్రదాయ ఆర్థిక మార్గం అంటే ఇండియాలో చాలా పనులు మ్యాన్యువల్‌గా జరుగుతాయి. అవన్నీ ఆటోమేషన్ వల్ల మనుషులు చేసే అవసరం లేకుండా ఆటోమేటిక్ జరుగుతుఊ ఉంటాయి. అలాగే చైనా, ఇథియోపియా దేశాల్లో 77శాతం ఉద్యోగాలు నష్టపోనున్నాయని అంచనా వేసింది. మొత్తానికి ఆటోమేషన్ ప్రభావంతో 85 శాతం ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని స్పష్టం చేసింది.

తీవ్రమైన పేదరికం పై కిమ్ బ్రూకింగ్స్ సంస్థలో మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ కిమ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత మూలంగా ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ దాని ప్రభావాలను అంచనా వేస్తున్నామని చెప్పారు. అభివృద్ధిని ప్రోత్సహించడానికి గాను తమ పెట్టుబడుల ప్రోత్సాహం కొనసాగుతుందన్న ఆయన దేశాల భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన వివిధ రకాల మౌలిక సౌకర్యాల గురించి సైతం ఆలోచిస్తున్నామన్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పారిశ్రామికీకరణ పూర్తిస్థాయిలో సాధ్యం కాకపోవచ్చని అన్నారు. సంప్రదాయ ఆర్థికవ్యవస్థ వృద్ధికి వ్యయసాయంలో ఉత్పాదకను పెంచడం ఒక మంచి మార్గంగా ఉపకరించగలదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
యాంత్రీకరణ, సాంకేతికత కారణంగా సంప్రదాయ పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతిందనీ, మనుషులు నేరుగా చేసేఉద్యోగాలు నష్టపోతున్నామనీ, ఈ ధోరణి అమెరికాకు పరిమితం కాదనీ, ప్రపంచ దేశాల్లో ప్రతిచోటా ప్రజలు దీనికి ప్రభావితమవుతున్నారని కిమ్ ఆందోళన వ్యక్తపరిచారు. దీనిపై చైనాలో జరిగిన జీ 20 సమావేశంలో ప్రపంచ నాయకులందరూ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. అయితే ఉమ్మడి వాణిజ్యం ద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్దికోసం ప్రపంచ దేశాల సమిష్టి కృషితో కొంత పురోగతి సాధించిన ప్పటికీ తీవ్రమైన ఎదురుగాలి తప్పడం లేదని కిమ్ వ్యాఖ్యానించారు. సరుకుల ధరల క్షీణత ప్రపంచ వాణిజ్యంలో మందగింపు కారణమవుతోందన్నారు. ఇది చారిత్రాత్మక స్థాయిలో ఉందని కిమ్ పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications