భారత్‌లో యాపిల్ ఫోన్ అమ్మకాలను ఒప్పో దాటేసింది. మార్కెట్ షేర్ పరంగా చూస్తే ఆగస్టు నెలలో యాపిల్ అమ్మకాలను దాటేసినట్లు ఒప్పో కంపెనీ తెలిపింది. ఈ మార్కెట్ విలువలు జీఎఫ్‌కే డేటా ఆధారంగా రూపొందించినవి. ఆగస్టు నెలలో ఒప్పో అమ్మకాల మార్కెట్ షేర్ 8 శాతం ఉండగా, యాపిల్ అమ్మకాల మార్కెట్ షేర్ 6.3 శాతంగా ఉంది. వివిధ కంపెనీల మార్కెట్ వాటాల వివరాలను కింద చూడవచ్చు.

మూడో స్థానంలో ఒప్పో
అయితే కౌంటర్ పాయింట్ అనే డేటా రీసెర్చ్ సంస్థ వాదన మరోలా ఉంది. యాపిల్ మార్కెట్ వాటా భారత్‌లో 5.6% ఉండగా,ఒప్పో 7% కలిగి ఉన్నట్లు చెబుతోంది. ఎలా చూసిన ఒప్పో మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఎప్పటిలాగే శ్యామ్‌సంగ్ ఉంటూ వస్తోంది. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన రిలయన్స్ లైఫ్ సైతం తన ప్రభావాన్ని చూపుతోంది.

జీఎఫ్‌కే డేటా
జీఎఫ్‌కే ప్రకారం శ్యామ్‌సంగ్ ఆగస్టు నెల మార్కెట్ వాటా 46.9% గా ఉంది. ఒప్పో మార్కెట్ వాటా 8శాతంగా ఉండగా, యాపిల్ వాటా 6.6%గా ఉంది. వినియోగదారుల అమ్మకాల ఆధారంగా దీన్ని రూపొందించారు.

కౌంటర్ పాయింట్ రీసెర్చి
ఈ సంస్థ సమాచారం ప్రకారం లెనోవా-మోటారోలా 8.5% మార్కెట్ వాటాను కలిగి ఉండగా, ఒప్పో 7% వాటాతో మార్కెట్‌లో 3వ స్థానాన్ని దక్కించుకుంది. చైనా కంపెనీ జియోమి 6.8% మార్కెట్ వాటాను కలిగి ఉండగా యాపిల్ కేవలం 5.6% వాటాతో 6వ స్థానంలో ఉంది.

ఒప్పో మార్కెట్ విజయానికి కారణాలు
పాయింట్ ఆఫ్ సేల్స్, సర్వీస్ సెంటర్లను బాగా పెంచింది. రిటైలర్ల దగ్గర అమ్మకాలు పెంచే విధంగా ప్రణాళికలు తయారుచేసింది. మార్కెటింగ్ వినూత్న ప్రచారాలతో యువతను బాగా ఆకట్టుకోగలిగింది. దేశీయ మార్కెట్‌లో శ్యామ్‌సంగ్ అత్యధిక వాటా దక్కించుకునేందుకు సైతం కారణం ఇదే.

యాపిల్ వాటా తగ్గేందుకు కారణం
కౌంటర్ పాయింట్ విశ్లేషకుడు తరుణ్ పాఠక్ విశ్లేషణ ప్రకారం యాపిల్ మొత్తం అమ్మకాల్లో 60 శాతం పాత మోడళ్ల నుంచే ఉంటున్నాయి. కొత్త మోడళ్లు రాకపోవడమే అమ్మకాలు తక్కువ అవడానికి కారణం. ఈ ఏడాది ప్రారంభం నుంచి అమ్మకాల్లో 5ఎస్ ఉంది. అందుకే టాప్5 అమ్మకాలు కలిగిన సంస్థల జాబితాలో లేదు. ప్రస్తుతం మార్కెట్‌లోకి అక్టోబర్ 7 నుంచి ఐఫోన్ 7ఎస్ వస్తుంది. దాని అమ్మకాలు ప్రారంభమైన తర్వాత యాపిల్ అమ్మకాలు పెరిగి తిరిగి టాప్5 మార్కెట్ వాటాదారుల్లో యాపిల్ నిలుస్తుందని భావిస్తున్నాం.

ఒప్పో
అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ సేవల కంపెనీ ఒప్పో. ఇది లేటెస్ట్, సరికొత్త మొబైల్ ఎలక్ట్రానిక్ పరికాలను తయారుచేస్తుంది. చైనా ప్రధాన కేంద్రంగా ఇది పనిచేస్తోంది. 20 దేశాల్లో దీనికి మార్కెట్ ఉంది. అమెరికా, చైనా,ఆస్ట్రేలియా, యూరప్, దక్షిణాసియా దేశాలు,ఆగ్నేసియా దేశాలు, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో దీనికి అమ్మకాలు ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications