ఎనిమిదేళ్ల క్రితం నెలకొన్న ఆర్థిక సంక్షోభం కాలం నుంచి ఇప్పటివరకు భారతీయులు వేతనాలు ఎంత పెరిగాయో వింటే ఆశ్చర్యపోతారు. అప్పటినుంచి ఇప్పటివరకు కేవలం 0.2 శాతం మాత్రమే భారతీయుల వేతనాలు పెరిగాయట. ప్రపంచ రెండో ఆర్థిక వ్యవస్థగా పేరున్న చైనా, ఓ వైపు తయారీరంగంలో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్పప్పటికీ వేతనాలను మాత్రం భారీగానే పెంచిందట. ఆ దేశ వేతన పెరుగుదల రికార్డు స్థాయిలో 10.6 శాతంగా నమోదైందని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కార్న్ ఫెర్రీ హే గ్రూపు డివిజన్ జరిపిన తాజా విశ్లేషణలో ఈ విషయాలు బయటపడ్డాయి. వాస్తవంగా మన దేశంలో వేతన వృద్ధి కేవలం 0.2 శాతం నమోదైనప్పటికీ, అదేకాలంలో జీడీపీ 63.8 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు.

2008 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే వేతనాలు పెరగడంలో చైనా తర్వాత ఇండోనేషియా(9.3శాతం), మెక్సికో(8.9శాతం) ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. అభివృద్ది చెందుతున్న కొన్ని ఇతర దేశాల్లో వేతన వృద్ది చాలా నిరాశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా దేశాల వేతన వృద్ది గణాంకాలను చూస్తే టర్కీ (-34.4%), అర్జెంటీనా( -18.6%), రష్యా( -17.1%), బ్రెజిల్ (-15.3%) ఉన్నాయి.
Read also: 2008 తర్వాత వేతనాలేమీ పెద్దగా పెరగలేదు
భారతదేశంలో వేతన వృద్ధి ఇంతకుముందునుంచి చాలా అసమానంగా ఉంటుందని కార్న్ ఫెర్రీ హే గ్రూపు గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ బెంజమిన్ ఫ్రాస్ట్ పేర్కొన్నారు. 30 శాతం మంది చాలా తక్కువగా, 30 శాతం మంది కొంచెం ఎక్కువగా వేతనాలు పొందుతున్నారని ఆయన వెల్లడించారు. కేవలం సీనియర్ లెవల్ ఉద్యోగాలకు మాత్రమే వేతన వృద్ధి ఉందని,అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో వేతనాల్లో వృద్ధి తక్కువగానే ఉందని ఫ్రాస్ట్ తెలిపారు. ఇక్కడ నైపుణ్యాలు లేమి, మిడిమిడి పరిజ్నానంతో వచ్చే ఉద్యోగుల శాతం పెరుగుతుండటంతో, వేతన వృద్ధి కూడా అంతతమాత్రంగానే ఉందని విశ్లేషించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ముందస్తు కాలంలో ఉన్న ధరల పెరుగుదల, కరెన్సీ విలువలో మార్పులు వేతన వృద్ధిని అంతలా పెంచలేకపోయాయని కార్న్ ఫెర్రీ హే గ్రూపు విశ్లేషణ ద్వారా వెల్లడయ్యింది.


Click it and Unblock the Notifications