వృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ శరవేగంగా దూసుకెళుతోంది. 2015లో భారత జీడీపీ రేటు 7.3% గా ఉంది. అయితే సూపర్ పవర్‌గా ఎదిగే కన్నా ముందు భారత్ చాలా అంశాల్లో అభివృద్ది చెందాల్సి ఉంది. మానవాభివృద్దిలో దేశం ఇంకా చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ శక్తిగా ఎదిగే క్రమంలో అమెరికా, చైనా దేశాలతో పోలిస్తే వివిధ అంశాల్లో భారత్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.

అవలోకనం
భాషలు
అమెరికా- ఇంగ్లీష్, చైనా-మ‌్యాండరిన్, భారత్-హిందీ, ఇంగ్లీష్
కరెన్సీ
అమెరికా- డాలర్, చైనా-యువాన్, భారత్- రూపాయి
రాజధాని
అమెరికా- వాషింగ్టన్ డీసీ, చైనా-బీజింగ్, భారత్-దిల్లీ

ప్రధాన పరిశ్రమలు
అమెరికాలో: ఇంధన రంగం, తయారీ రంగం, రవాణా రంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఆ దేశ జీడీపీకి అత్యధికంగా 13% ఆదాయాన్ని సమకూరిస్తే తర్వాతి స్థానాల్లో ఆర్థికవ్యవహారాలు, బీమా; వైద్య రంగం, తయారీ రంగం ఉన్నాయి.
భారత్‌లో: టెలికమ్యూనికేషన్స్, టెక్స్‌టైల్స్, రసాయనాలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఉక్కు, రవాణా పరికరాలు, సిమెంట్, మైనింగ్, పెట్రోలియం, మెషినరీ, సాఫ్ట్‌వేర్, ఫార్మాస్యుటికల్స్
చైనాలో: మైనింగ్,ఖనిజ శుద్ది పరిశ్రమలు, ఇనుము, ఉక్కు, అల్యూమినియం, ఇతర లోహాలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, బొగ్గు, మెషీన్ బిల్డింగ్, దుస్తుల తయారీ, పాదరక్షలు, పెట్రోలియం, సిమెంట్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, కన్సూమర్ ఉత్పత్తులు, బొమ్మల తయారీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, రవాణా పరికరాలు(ట్రాన్స్‌పోర్ట్ ఎక్విప్‌మెంట్), ఆటోమొబైల్స్, రైల్ కార్స్, లోకోమోటివ్ ట్రైన్, నౌకల తయారీ, విమానాల తయారీ, టెలికమ్యూనికేషన్ సంబంధిత పరికరాలు, వాణిజ్య వాహనాలు, శాటిలైట్లు

ప్రధాన దిగుమతులు
అమెరికా: వ‌్యవసాయ ఉత్పత్తులు-4.9%; పారిశ్రామిక అవసరాలు-32.9%; క‌్యాపిటల్ గూడ్స్-30.4%; కన్సూమర్ గూడ్స్(వినియోగదారు వస్తువులు)-31.8%
భారత్: ముడి చమురు, విలువైన రాళ్లు, మెషినరీ, ఫర్టిలైజర్, ఇనుము, ఉక్కు, రసాయనాలు
చైనా: ఎలక్ట్రికల్,ఇతర మెషినరీ, చమురు, ఖనిజ ఇంధనాలు, ఆప్టికల్, మెడికల్ ఎక్విప్‌మెంట్, ఖనిజ ధాతువులు, ప్లాస్టిక్, ఆర్గానిక్ కెమికల్స్

ప్రధాన ఎగుమతులు
అమెరికా: సోయాబీన్స్, పండ్లు, కార్న్- 9.2% ; ఆర్గానిక్ కెమికల్స్-26.8%, ట్రాన్సిస్టర్స్,ఎయిర్‌క్రాఫ్ట్, మోటార్ వాహనాల విడిభాగాలు, కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు-49%; ఆటోమొబైల్స్, మందులు(మెడిసెన్స్)-15%
భారత్: పెట్రోలియం ఉత్పత్తులు, విలువైన రాళ్లు, మెషినరీ, ఇనుము, ఉక్కు, రసాయనాలు, వాహనాలు, పాదరక్షలు
చైనా: ఎలక్ట్రికల్ ఇంకా ఇతర మెషినరీ, డేటా ప్రాసెసింగ్ ఎక్విప్‌మెంట్, పాదరక్షలు, ఇనుము, ఉక్కు, ఆప్టికల్, మెడికల్ ఎక్విప్‌మెంట్

ఆర్థిక వ్యవస్థలు
అమెరికా జీడీపీ- 17.9 బిలియన్ డాలర్లుగా ఉంటూ ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది.
చైనా జీడీపీ- 10.4 బిలియన్ డాలర్లు
భారత జీడీపీ- 2.07 బిలియన్ డాలర్లు
ప్రస్తుతం చైనా జీడీపీ భారత జీడీపీకి 5 రెట్లు ఉంది.

జనాభా
అమెరికా-32.1 కోట్లు (జనసాంద్రత-35.14 చ.కి.మీ)
చైనా- 137 కోట్లు (జనసాంద్రత-146.1 చ.కి.మీ)
భారత్- 131 కోట్లు (జనసాంద్రత-441 చ.కి.మీ)
జనాభా సగటు వయసు
అమెరికా- 37.8
చైనా- 36.8
భారత్-27.3
ప్రస్తుతం భారతదేశానికి ఉన్న ప్రధాన బలం ఇదే. సగటు వయసు అతి తక్కువగా ఉండటంతో అత్యధిక శ్రామిక శక్తి కలిగిన దేశంగా భారత్ వెలుగొందుతోంది. ఈ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుని ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచగలిగితే 2030 నాటికి చైనా, అమెరికాలతో పోటీపడగలిగే స్థాయికి రావచ్చు.

అక్షరాస్యత
పెద్దల అక్షరాస్యత రేటు ఈ మూడు దేశాల్లో ఈ విధంగా ఉంది
అమెరికా- 86%, చైనా-95.12%, భారత్-69.3%
అక్షరాస్యతలో వెనుకబడి ఉండటమే భారతదేశంలోని అనేక రుగ్మతలకు కారణం.

వైద్యం(ఆరోగ్యం)
సగటు జీవిత కాలం
అమెరికా- 79 ఏళ్లు; చైనా- 75 ఏళ్లు; భారత్- 68 ఏళ్లు
శిశు మరణ రేటు
అమెరికా- 5.6, చైనా-9.2; భారత్- 37.9
శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండటం దేశ ప్రగతికి విరోధం.
ఆహార కొరత
చైనాలో ఒక్కో వ్యక్తికి ఒక్కో రోజుకు 85 కిలోకెలరీల ఆహరం కొరతగా ఉంది.
ఇండియాలో ఒక్కో వ్యక్తికి ఒక్కో రోజుకు 109 కిలోకెలరీల ఆహారం కొరతగా ఉంది.

టెక్నాలజీ
ఇంటర్నెట్ వినియోగదారులు
అమెరికాలో ప్రతి వంద మందిలో 87.36 మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నారు.
చైనాలో ప్రతి 100 మందిలో 49.3 మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నారు.
ఇండియాలో ప్రతి 100 మందిలో 18 మంది మాత్రమే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు.
మొబైల్ వాడకందార్లు
ప్రతి 100 మందికి 110 కనెక్షన్లతో అమెరికా మొబైల్ వాడకందార్లలో ముందుంది.
ప్రతి 100 మందిలో 92 మంది మొబైల్ కనెక్షన్లతో చైనా మధ్యలో ఉంది.
ప్రతి 100 మందికి 74 మొబైల్ కనెక్షన్లతో ఇండియా, ఈ రెండు దేశాల కంటే వెనుకబడి ఉంది.

మిలిటరీ (రక్షణ రంగం)
అమెరికా దేశ జీడీపీలో 3.32 % రక్షణకే ఖర్చుపెడుతోంది.
మరోవైపు చైనా జీడీపీలో 1.98%, భారత్ తన జీడీపీలో 2.42% రక్షణ రంగానికి ఖర్చు చేస్తున్నాయి.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications