దేశంలోని మొబైల్ వాడకందార్ల సంఖ్య జూన్ చివరకి 103.5 కోట్లకు చేరింది. ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ మళ్లీ టాప్-5 టెలికం కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. ట్రాయ్ గణాంకాల ప్రకారం.. మొత్తం టెలికం వినియోగదరార్ల సంఖ్య (వైర్లెస్, వైర్‌లైన్) 105.9 కోట్లుగా ఉంది. మే నెలలో 103.3 కోట్లగా ఉన్న మొబైల్ సబ్స్క్రైబర్ల (వైర్లెస్) సంఖ్య జూన్ చివరికి 0.19% స్వల్ప వృద్ధితో 103.5 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో వైర్‌లైన్ యూజర్ల సంఖ్య 2.48 కోట్ల నుంచి 2.47 కోట్లకు తగ్గింది.

టాప్-5లోకి బీఎస్ఎన్ఎల్
భారతీ ఎయిర్‌టెల్‌కు అత్యధికంగా 14 లక్షల మంది కొత్త యూజర్లు జతయ్యారు. దీంతో కంపెనీ మొత్తం వినియోగదార్ల సంఖ్య 25.57 కోట్లకు చేరింది.
వినియోగదార్ల సంఖ్య పెరగడంలో ఎయిర్టెల్ తర్వాత బీఎస్ఎన్ఎల్ ఉంది. దీనికి 13 లక్షల మంది జత చేరారు. దీంతో కంపెనీ మొత్తం యూజర్లు 8.95 కోట్లకు చేరారు. ఈ చర్యతో బీఎస్ఎన్ఎల్ టాప్-5 మొబైల్ సర్వీసెస్ కంపెనీల జాబితాలో ఎయిర్‌సెల్‌ను వెన క్కు నెట్టి ఐదవ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాగా బీఎస్ఎన్ఎల్ గతేడాది ఏప్రిల్‌లో ఈ ఐదవ స్థానం నుంచే కిందకు జారిపోయింది.
ఎయిర్‌సెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కొత్తగా 6.7 లక్షలు పెరిగింది. దీంతో కంపెనీ యూజర్లు 8.89 కోట్లకు చేరారు.
వొడాఫోన్‌కు యూజర్ల సంఖ్య 7 లక్షల పెరుగుదలతో 19.93 కోట్లకు ఎగసింది.
ఐడియా కస్టమర్ల సంఖ్య 6.8 లక్షలు పెరిగింది. మొత్తం యూజర్లు 17.62 కోట్లకు చేరారు.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications