మీరు మీ సహోద్యోగులతో పోలిస్తే ఎక్కువ పన్ను కడుతున్నారని భావిస్తున్నారా? పన్ను ఆదా చేసే మార్గాల గురించి ఆలోచిస్తున్నారా? ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటిదాకా సరైన ట్యాక్స్ ప్లానింగ్ చేయలేదా?
మీరు మీ సహోద్యోగులతో పోలిస్తే ఎక్కువ పన్ను కడుతున్నారని భావిస్తున్నారా? పన్ను ఆదా చేసే మార్గాల గురించి ఆలోచిస్తున్నారా? ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటిదాకా సరైన ట్యాక్స్ ప్లానింగ్ చేయలేదా? పన్ను ఆదాకు మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. వేతనంపై పన్ను ఆదా కోసం 8 ఉత్తమ మార్గాలను ఇక్కడ చదవండి.

మీల్ వోచర్స్
కంపెనీ మీల్ వోచర్స్ / ఫుడ్ కూపన్స్ అందిస్తూ ఉంటే అవి తీసుకోండి. వీటికి ఏడాది కాలంలో రూ. 60 వేల వరకూ పన్ను మినహాయించుకునే అవకాశం ఉంది.

ప్రయాణ ఖర్చులకోసం భత్యం(కన్వేయన్స్ అలవెన్సు)
మీ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ప్రయాణాలు చేస్తున్నారా? ఇంటికి, కార్యాలయానికి వ్యక్తిగత, ప్రజా రవాణాను ఉపయోగిస్తుంటే వేతనంలో కన్వేయన్స్ అలవెన్సు ఉండేలా చూసుకోండి.
నెలకు రూ. 1600 వరకూ కన్వేయన్స్ అలెవన్సు పన్ను మినహాయింపు కలిగి ఉంటుంది. ఏడాదికి రూ. 19,200 వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. 10 శాతం పన్ను జోన్‌లో ఉన్నవారు దాదాపు రూ. 2 వేల వరకూ, అధిక పన్ను జోన్‌లో ఉన్నవారు రూ. 3840 వరకూ ఈ రూపంలో ఆదా చేసుకోవచ్చు.

అలవెన్సు
వేరే ఇతర అలవెన్సుల ద్వారా సైతం పన్ను మినహాయింపులను పొందవచ్చు. ఉదాహరణకు కనీసం రూ. 500 పైబడి టెలిఫోన్, మొబైల్ బిల్లు ఉంటే దానిని మొత్తం వేతనం రూపంలో తీసుకోకుండా అలవెన్సు రూపంలో పొందాలి. అలా కొన్ని అలవెన్సులు పన్ను మినహాయింపుకు అర్హత కలిగి ఉన్నాయి. కంపెనీ హెచ్ ఆర్, అడ్మినిస్ట్రేషన్‌ను సంప్రదించి వీటి గురించి తెలుసుకోవచ్చు.

ఎల్‌టీఏ
కాస్త అధిక పన్ను జోన్‌లో ఉన్నవారికి కంపెనీ ఎల్‌టీఏ అందించకపోతే మీరు అడిగి ఎల్‌టీఏ తీసుకోండి. ప్రతి రెండేళ్లకోసారి ఎల్‌టీఏకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే దీనికి బిల్లులు సమర్పించాలి. ఎల్‌టీఏ అంటే లీవ్ ట్రావెల్ అలవెన్సు.

పీపీఎఫ్ ఖాతా కేటాయింపు పెంపు
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద పీపీఎఫ్ పన్ను మినహాయింపులకు అర్హత కలిగి ఉంది. పీపీఎఫ్ కోసం చేసే కేటాయింపులను పెంచుకోవడం ద్వారా సైతం పన్ను మినహాయింపులను పొందవచ్చు.

మెడికల్ బిల్లులు
మెడికల్ బిల్లులు సమర్పించి సైతం పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈ రూపంలో రూ. 15 వేల వరకూ ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఖర్చును మీకు మీరుగా కానీ లేదా మీపై ఆధారపడిన వారి మీద కానీ వెచ్చించి ఉండాలి. లేకపోతే పన్ను మినహాయింపును పొందలేరు.

ఇతరాలు
80సీ మార్గాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎల్ఐసీ, పీపీఎఫ్, ఈపీఎఫ్, గృహ రుణం అసలు వంటి వాటి ద్వారా పన్ను మినహాయింపులకు గరిష్ట ప్రయోజనాలను పొందాలి. 80 సీ ద్వారా మొత్తం రూ. 1లక్ష యాభై వేల వరకూ ప్రయోజనాలను వినియోగించుకోవచ్చు.
10 శాతం పన్ను పరిధిలో ఉంటే రూ. 15వేలు, 20 శాతం పన్ను పరిధిలో ఉంటే రూ. 30 వేలు, అంతకన్నా ఎక్కువ పన్ను పరిధిలో ఉంటే రూ. 45 వేల వరకూ ఆదా చేసుకోవచ్చు.

రుజువుల మాటేమిటి?
క్లెయిం చేసుకోవడం బాగానే ఉంటుంది. మరి రుజువుల మాటేమిటి? వీలైనంత తొందరగా అవసరమైన పత్రాలను సిద్దం చేసుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ అడిగిన వాటినన్నింటినీ సబ్‌మిట్ చేయడం ద్వారా వేతనంపై టీడీఎస్ లేకుండా చేసుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications