నల్లధనంపై ప్రభుత్వ విధానాలను పార్లమెంటు సాక్షిగా వెల్లడించారు అరుణ్ జైట్లీ. పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పలు విషయాలను వెల్లడించారు. దీని ప్రకారం గత రెండేళ్లలో ఆదాయపు పన్ను శాఖ చేసిన 9500 సర్వేల్లో రూ. 22475 కోట్ల వెల్లడి అవ్వని ఆదాయాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యల్లో భాగంగా ఆ శాఖ గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 990 గ్రూపుల్లో తనిఖీలు నిర్వహించిందని లోక్ సభలో జైట్లీ చెప్పారు.

అంతేకాకుండా ఐటీ శాఖ పరంగా జరుగుతున్న క్రిమినల్ విచారణలు కూడా పెరుగుతున్నాయన్నారు. 2102-13, 3013-14 సమయంలో 1690 క్రిమినల్ కేసులు నమోదవ్వగా 2014-15, 2015-16 సంవత్సరాల్లో వీటి సంఖ్య 3140 కి పెరిగింది. నల్ల ధనాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టిందని జైట్లీ చెప్పారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు, పనామా లీక్స్‌లో ఉన్న వివరాలకు సంబంధించి మల్టీ ఏజెన్సీ గ్రూప్, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్థిక సమాచారాన్ని వివిధ వ్యవస్థల మధ్య పంపిణీ చేసుకోవడం, బినామీ లావాదేవీల(నిషేధ) చట్టం వంటివి వీటిలో ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వం నల్లధనాన్నిఅరికట్టేందుకు ప్రయత్నిస్తోందని జైట్లీ వెల్లడించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications