ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు టెలికాం దిగ్గజం తీపి కబురు అందించింది. 2జీ, 3జీ, 4జీ డేటా ప్యాక్‌లపై 67శాతం అదనపు డేటా ఇవ్వనున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.655తో రీఛార్జి చేయించుకుంటే 3జీబీ డేటా వచ్చేది. దాన్ని 5జీబీకి పెంచారు. చిన్న డేటా ప్యాక్‌లపై కూడా అదనపు డేటా సౌకర్యాన్ని ఎయిర్టెల్ అందిస్తోంది. 25తో రీఛార్జి చేయించుకుంటే 100 ఎంబీకి బదులు 145 ఎంబీ, రూ.145 రీఛార్జితో 440 ఎంబీకి బదులు 580 ఎంబీ డేటాను ఇస్తోంది. సవరించిన టారిఫ్‌లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.
మరో ప్రముఖ మొబైల్ నెట్వర్క్ ఐడియా సైతం ఇటీవల తమ వినియోగదారులకు అదనపు డేటా సౌకర్యం కల్పించింది. 2జీ, 3జీ, 4జీ ప్యాక్‌లపై 45 శాతం అదనపు డేటాను అందించనున్నట్లు ప్రకటించింది. 1జీబీ కన్నా తక్కువ డేటా వినియోగించే వారికి 45 శాతం అదనపు ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇంతకుముందు రూ. 19 తో రీచార్జీ చేసుకుంటే వచ్చే డేటా పరిమితిని 75 ఎంబీ నుంచి 110 ఎంబీకి పెంచారు. అదే విధంగా రూ. 22 తో చేసుకునే రీచార్జీకి 65 ఎంబీ నుంచి 90 ఎంబీకి పెంచారు.

రిలయన్స్ జియో నుంచి పోటీని తట్టుకోవడానికే ఇలా మొబైల్ సంస్థలన్నీ కొత్త దారులను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జియో సేవలు అందుబాటులోకి రానున్నాయన్న వార్తల నేపథ్యంలో మొబైల్ ఆపరేటర్లు ఇలా వరుస ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications