జూన్ నెలలో దేశీయ ఎగుమతులు 1.27 శాతం పెరిగి 22.57 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 18 నెలల తర్వాత ఎగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చడం ఇదే. పెరుగుతున్న ఎగుమతులు, తగ్గుతున్న దిగుమతుల మూలంగా వాణిజ్య లోటు 8.11 బిలియన్ డాలర్లకు తగ్గింది. గతేడాది జూన్ నెలలో ఇది 10.8 బిలియన్ డాలర్లుగా ఉంది.
అంతర్జాతీయ డిమాండ్ బలహీనంగా ఉండటంతో పాటు, చమురు ధరల తగ్గుదల మూలంగా 2014 డిసెంబరు నుంచి ఎగుమతుల వాటా తగ్గుతూ వస్తోంది. వాణిజ్య, పరిశ్రమల శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో దిగుమతులు 30.68 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో ఉన్న 33.11 బిలియన్ డాలర్ల కంటే ఇవి 7.33 శాతం తక్కువ. పెట్రోలియం, ముడి చమురు,సంబంధిత ఉత్పత్తుల దిగుమతులు 16.42 శాతం తగ్గుదల నమోదు చేయగా; బొగ్గు, కోక్, బ్రిక్వెట్స్ సైతం 13 శాతం తగ్గుదలతో దిగుమతులను నెమ్మదించేలా చేశాయి.

ఏప్రిల్-జూన్ మధ్య వాణిజ్య లోటును 19.23 బిలియన్ డాలర్లుగా అంచనా వేయగా, ఇది గతేడాది ఉన్న 32.225 బిలియన్ డాలర్ల కంటే చాలా తక్కువ. సేవల రంగ ఎగుమతులు చూస్తే 13.46 బిలియన్ డాలర్లుగా ఉంటూ 4.28 శాతం వృద్దిని కనబరిచాయి. అదే సమయంలో సేవా రంగ దిగుమతులు 10.29 శాతం పెరుగుదలతో 7.92 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications