మన దేశంలో పన్ను మినహాయింపులు పొందేందుకు పన్ను రహిత బాండ్లు ఉత్తమమైనవి. ఆర్థిక వ్యవస్థలో ఒకవైపు వడ్డీ రేట్లు తగ్గుతున్న క్రమంలో కొన్ని బాండ్లు ఆఫర్ ధర కంటే పెరగడం చూస్తున్నాం. అధిక పన్ను పరిధిలో ఉన్నవారికి ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. మంచి రాబడినిస్తాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ పరిశీలిద్దాం.

ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్1 సిరీస్
తమ పన్ను రహిత బాండ్లకు ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ 8 శాతం వడ్డీని ఇస్తోంది. రూ. 1000 వద్ద జారీ చేసిన బాండ్లు ప్రస్తుతం రూ. 1134 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాండ్లపై తదుపరి వడ్డీని అక్టోబర్, 2016లో ప్రకటిస్తారు. అధిక పన్ను పరిధిలో ఉన్నవారికి ఇది బాగా ఉపకరించగలదు.

హడ్కో ఎన్2 బాండ్లు
హడ్కో అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. పట్టణ, నగర ప్రాంతాల్లో గృహ వసతిని పెంచే దిశగా ఇది పనిచేస్తుంది. ఈ బాండ్లకు వడ్డీ రేటు 8.2 శాతంగా ఇస్తున్నారు. వడ్డీని ఏటా మార్చి 5న చెల్లిస్తారు. దీని కూపన్ రేట్లు ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. వడ్డీ రేట్లలో తగ్గుదల మూలంగా రాబడి తగ్గినప్పటికీ బాండు ధరలు బాగా లాభపడ్డాయి.

హడ్కో ఎన్3 బాండ్లు
హడ్కో ఎన్2 బాండ్ల మాదిరిగానే ఈ బాండ్లు ఉంటాయి. హడ్కో ఎన్3 బాండ్ల కూపన్ రేటు 8.1 శాతంగా ఉంటోంది.
ఈ బాండ్లు ప్రస్తుతం రూ. 1107 ధర వద్ద ఉన్నాయి. తదుపరి వడ్డీ రేట్ల ప్రకటన తేదీ మార్చి 5, 2017.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఎన్ఎస్ఈలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బాండ్లు రూ. 1151 ధర వద్ద ఉన్నాయి. ఈ బాండ్ల కూపన్ రేటు 8.2 శాతంగా ఉంది. తదుపరి వడ్డీ రేట్ల చెల్లింపు తేదీ అక్టోబర్ 1,2016.

ఆర్‌ఈసీ ఎన్6 బాండ్లు
8 శాతం కన్నా ఎక్కువ వడ్డీ రేట్లను అందించే బాండ్ల కోవలో ఇవి ఉన్నాయి. ప్రస్తుతం ఈ బాండ్ల వడ్డీ రేట్లు 8.46 శాతంగా ఉన్నాయి. తదుపరి వడ్డీ చెల్లింపు తేదీ డిసెంబరు 1,2016. వీటిని వడ్డీ రేట్లు, కూపన్ రేట్ల విషయంలో ఒక రకంగా ఉత్తమ బాండ్లుగా చెప్పుకోవచ్చు.

ఇండియన్ రైల్వేస్ ఎన్7 సిరీస్
ఇండియన్ రైల్వేస్ ఎన్7 సిరీస్ బాండ్లు 8.23 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. చాలా పన్ను రహిత బాండ్లతో పోల్చి చూస్తే ఇవి ఉత్తమ కూపన్ రేట్లను అందిస్తున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో ఈ బాండ్ల ధర ప్రస్తుతం రూ. 1105గా ఉంది.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్6 సిరీస్
ఈ బాండ్లు ప్రస్తుతం రూ. 1210 వద్ద ట్రేడవుతుండగా, 8.75 శాతం కూపన్ రేటును అందిస్తున్నాయి. తదుపరి వడ్డీ చెల్లింపు తేదీ మార్చి 2017.


Click it and Unblock the Notifications