జూన్ నెలకు ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 24.79 శాతం పెరుగుదలతో మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ. 1.24 లక్షల కోట్లకు పెరిగాయి. వ్యక్తుల ముందస్తు పన్నుల చెల్లింపుకు సంబంధించి గతేడాది బడ్జెట్లో చేసిన మార్పులే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇంతకుముందు వ్యక్తులు ముందస్తు చెల్లింపులను సంవత్సరంలో మూడు సార్లు అంటే సెప్టెంబరు, డిసెంబరు, మార్చి నెలల్లో చేసేవారు, ఈ ఏడాది నుంచి జూన్, సెప్టెంబరు, డిసెంబరు, మార్చి నెలల్లో 15%, 30%, 30%, 25% చొప్పున నాలుగుసార్లుగా చెల్లింపులు చేసే విధంగా మార్పులు చేశారు. జూన్ నెల వరకూ వచ్చిన వసూళ్లను చూస్తే వార్షిక బడ్జెట్లో భాగంగా ప్రత్యక్ష పన్ను లక్ష్యంలో 14.63 శాతంగా ఉన్నాయి.

కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్నుల పరంగా చూస్తే కార్పొరేట్ పన్ను వసూళ్లలో పెరుగుదల 13.5 శాతంగా(సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను కలుపుకొని) ఉండగా, వ్యక్తిగత పన్ను వసూళ్లలో గతేడాదితో పోలిస్తే 29.8శాతం పెరుగుదల ఉంది. రీఫండ్ల తర్వాత మిగిలిన పన్ను వసూళ్లను గతేడాదితో పోల్చి చూస్తే నికర కార్పొరేట్ పన్ను వృద్ది 4.43 శాతంగాను, వ్యక్తిగత ఆదాయపు పన్నులో పెరుగుదల 48.75 శాతంగాను ఉన్నాయి. ఈ సంవత్సరంతో పోలిస్తే గతేడాది ఎక్కువ రీఫండ్లు చేసిన మూలంగానే పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications