2016-17లో రైతులు వడ్డీ రాయితీ పథకం గురించి తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్య విషయాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ 2016-17 సంవత్సరానికి గాను వడ్డీ రాయితీ పథకాన్ని ఆమోదించింది. ఒక ప్రత్యేక రంగాన్ని ప్రోత్సహించేందుకుగాను, తద్వారా ప్రజా ఆసక్తిని పెంపొందించేందుకు రుణానికి సంబంధించి కొంత శాతం వడ్డీ రాయితీని కల్పించే పథకం వడ్డీ రాయితీ పథకం. ఒక ప్రత్యేక పరిశ్రమ లేదా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రుణాలకు సంబంధించి వడ్డీలో కొంత శాతాన్ని ఈ పథకం కింద భరిస్తుంది.

ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 18,276 కోట్లను కేటాయించింది. ఏడాదిలోపు రైతులు తీసుకునే స్వల్పకాలిక రుణాల్లో రూ. 3 లక్షల వరకూ తీసుకునేవాటికి ప్రభుత్వం 5 శాతం రాయితీని చెల్లిస్తుంది. దీంతో రైతులు 4 శాతం వార్షిక వడ్డీ రేటుకు రుణాలను పొందవచ్చు.
ఈ పథకంలోని ముఖ్యాంశాలు:
1) 2016-17 ఆర్థిక సంవత్సరంలో రైతులు స్వల్పకాలిక రుణాల్లో భాగంగా రూ. 3 లక్షల వరకూ తీసుకునే రుణాలకు వడ్డీ రాయితీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 5 శాతం రాయితీని అందిస్తుంది.
దీంతో రైతులు చెల్లించాల్సిన వడ్డీ 4 శాతంగా ఉంటుంది. ఒకవేళ రైతులు స్వల్పకాలిక రుణాలను సకాలంలో చెల్లించకపోతే వారు 5 శాతం రాయితీకి బదులు 2శాతం రాయితీకి అర్హతను పొందుతారు.
2) 2016-17 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 18,276 కోట్లను కేటాయించింది.
3) చిన్న, మధ్య తరహా రైతులను ఆదుకుని తద్వారా పంట కోత తర్వాత వారి ఉత్పత్తలును నిల్వ ఉంచుకునేందుకు, సరైన మార్కెట్లో అమ్ముకునేందుకు 2 శాతం రాయితీని అందిస్తోంది. 6 నెలల కాలానికి తీసుకునే రుణాలకు 9 శాతం కాకుండా ప్రభుత్వ రాయితీతో 7 శాతం వడ్డీకి రుణాలు అందించేలా ఏర్పాటు చేశారు.
4) సహజ విపత్తుల వల్ల ప్రభావితమైన రైతులకు భరోసానిచ్చేందుకు, రుణ పునర్‌వ్యవస్థీకరణ జరిగిన మొదటి ఏడాదిలో బ్యాంకులకు 2 శాతం వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేస్తున్నారు.
5) స్వల్పకాలిక రుణాలకు సంబంధించి 5 శాతం రాయితీని అమలు చేస్తున్నప్పటికీ, రైతులు సకాలంలో తమ రుణాలను చెల్లించకపోతే 2 శాతం వడ్డీ రాయితీ పథకాన్ని వర్తింపజేస్తారు.


Click it and Unblock the Notifications