న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్ దిగ్గజ సంస్ధ అమెజాన్ భారత్ ఈ కామర్స్ రంగంలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకునేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతోంది. ఆన్‌లైన్ రంగంలో ఫ్లిప్‌కార్ట్ పోటీని తట్టుకుంటూనే భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు గాను అదనంగా 300 కోట్ల డాలర్లను(దాదాపు రూ.20,169.75 కోట్లు) పెట్టుబడులను పెడుతున్నట్టు అమెజాన్ ప్రకటించింది.
భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఏడాది అనంతరం 2014లో 200 కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెడతామని అమెజాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లో మొత్తం 500 కోట్ల డాలర్లను(రూ.30,750కోట్లు) పెట్టుబడులుగా పెడుతున్నట్టు అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ ప్రకటించారు.
భారత ఈ కామర్స్ రంగంలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు గాను ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ లాంటి వెబ్‌సైట్లతో అమెజాన్ పోటీ పడుతోంది. అమెజాన్ పెట్టనున్న ఈ పెడ్డుబడులను కంపెనీ డిస్కౌంట్లు, ప్రకటనలు, లాజిస్టిక్స్ తదితరాలకు వినియోగించుకోనుంది.

భారత్‌లో అమెజాన్ పెట్టుబడుల వెల్లువ
ప్రధాని మోడీ అమెరికా పర్యనటలో ఉండగా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఈ పెట్టుబడుల ప్రకటన చేయడం విశేషం. యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ఐబీసీ) గ్లోబల్ లీడర్ షిప్ అవార్డును, సన్ ఫార్మాస్యూటికల్ వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీతో కలిసి బెజోస్ ప్రధాని మోడీ చేతుల మీదుగా అందుకున్నారు.

భారత్‌లో అమెజాన్ పెట్టుబడుల వెల్లువ
ఈ సందర్భంగా ఆమెజాన్ సీఈఓ బెజోస్ మాట్లాడుతూ భారత ఆర్థికవ్యవస్థలో మరింత వృద్ధిని సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత్ మార్కెట్‌లోకి అమెజాన్ జూన్ 2013న ప్రవేశించింది. గత వారమే అమెజాన్ మూడేళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకుంది. కాగా ఫ్లిప్‌కార్ట్ 2007, స్నాప్‌డీల్ 2010లో భారత మార్కెట్లోకి ప్రవేశించాయి.

భారత్‌లో అమెజాన్ పెట్టుబడుల వెల్లువ
సరుకు రవాణాలో ఇప్పటికే స్నాప్‌డీల్‌ను అమెజానా దాటేసింది. ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ షేర్‌కు సమీపంలో ఉంది. కాగా అమెజాన్ భారత మార్కెట్లో 45 వేల ఉద్యోగాలను సృష్టించింది. అతిపెద్ద మార్కెట్ చైనాను సొంతం చేసుకోవాలన్న అమెజాన్‌కు అక్కడి స్థానిక ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాతో గట్టి పోటీనే ఎదురైంది.

భారత్‌లో అమెజాన్ పెట్టుబడుల వెల్లువ
దీంతో చివరకు ఆలీబాబాతో పోటీని తట్టుకోలేక చైనా మార్కెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం భారత మార్కెట్‌పై పట్టు సాధించేందుకు గాను భారీ ఎత్తున పెట్టుబడులను పెడుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత మార్కెట్‌ను గెలవడం కూడా అమెజాన్ కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.More From GoodReturns

ఇరాన్ యుద్ధం.. ఎరువుల కొరతతో సంక్షోభంలోకి వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ మార్గాలు వైపు కేంద్రం అడుగులు..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..



Click it and Unblock the Notifications