ఆ ఈ-మెయిల్స్ ఆర్‌బీఐ పంపడం లేదు: రాజన్ హెచ్చరిక

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పేరిట వస్తున్న ఈ మెయిల్స్‌ను ఎవరూ నమ్మవద్దని ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వెల్లడించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఆర్‌బీఐ వద్ద ఎవరూ క్లయిమ్ చేయని డబ్బుపై వచ్చే ఈ మెయిల్స్‌ను తాము పంపడం లేదని రాజన్ స్పష్టం చేశారు.

ఆర్‌బీఐ పేరిట వస్తున్న ఈ తరహా మెయిల్స్ అసలైనవా? నకిలీవా? అని ప్రశ్నిస్తూ తనకు రోజుకు 10 ఈ మెయిల్స్ చొప్పున వస్తున్నాయని తెలిపారు. అందుకే తాను ఈ విషయంపై స్పందించాల్సి వస్తోందని తెలిపారు.

Raghuram Rajan cautions public against false e-mails in RBI's name

"రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లింపులు కోరుతూ ఎప్పుడూ ఈ మెయిల్స్ పంపదు. మా వద్ద 360 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలు ఉన్నాయి. దీనితో పాటు మా వద్ద రూ. 8 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లు ఉన్నాయి. మాకు మీ డబ్బు అవసరం లేదు" అని అన్నారు.

"మీకు ఒక ఈ మెయిల్ వచ్చి, మీకు లాటరీలోనో లేదా ప్రతిఫలంగానో రూ. 50 లక్షలు వచ్చాయి. లావాదేవీ ఖర్చుల కింద రూ. 20 వేలు కట్టండి అని ఈ మెయిల్స్ వస్తే, ఎట్టి పరిస్థితుల్లోను వాటిని నమ్మవద్దు. మా డబ్బును ఎవరికీ ఇవ్వం, మీ డబ్బును అడగం" అని రాజన్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+