ముంబై: భారత దేశపు అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల మార్కెట్లో 38 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉందని ఎస్బీఐ తెలిపింది.
డిసెంబర్ 2015 నాటికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న గణాంకాల ప్రకారం వాల్యూమ్ పరంగా మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో 38.44 శాతం, విలువ పరంగా సుమారు 36 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు పేర్కొంది.

గత డిసెంబర్లో రూ. 17,636 కోట్ల విలువ చేసే 151.83 లక్షల లావాదేవీలు జరిగినట్లు ఎస్బీఐ పేర్కొంది. కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలైన ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ లావాదేవీలు వాల్యూమ్ పరంగా 70 లక్షలకు, యాక్సిస్ బ్యాంక్ 60 లక్షలకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 39 లక్షలకే పరిమితమయ్యాయి.
మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలపై ఏస్బీఐ ఛైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య మాట్లాడుతూ 2015 ఏప్రిల్ నుంచీ తాము అగ్రస్థానంలో కొనసాగుతున్నామని చెప్పారు. గతేడాది మే నెలలో స్టేట్‌బ్యాంక్ ఎనీవేర్-సరళ్ పేరుతో మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను ఎస్బీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications