భారీ డిస్కౌంట్: ఎయిర్ ఏషియా శివరాత్రి ఆఫర్
ముంబై: చౌక ధరల విమానయాన సంస్ధ ఎయిర్ ఏషియా మరోసారి భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో టికెట్ల ధరలపై డిస్కౌంట్‌ను ఆఫర్ చేసింది. రూ. 1,099లకే ఆ పైబడిన ధరలకే ఈ ఆఫర్ కింద టికెట్లు అందించనుంది.
అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది నుంచి మే 22 తేదీల్లో ప్రయాణించడానికి డిస్కౌంట్ ధరలతో కూడిన విమాన టికెట్లను మార్చి 7 నుంచి ఈ నెల 13 వరకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఆసియా విమానాలు నడుస్తున్న బెంగళూరు, విశాఖపట్టణం, గౌహతి, కోచి, ఇంఫాల్, గోవా, ఢిల్లీ రూట్లలో ఈ ఆఫర్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

దేశవాళీ సర్వీసుల్లో కనీస ధర 1099 రూపాయల నుంచి టికెట్లను అందుబాటులో ఉంచించింది. మరోవైపు కోచి నుంచి చెన్నై లేదా హైదరాబాద్ మీదుగా మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు 2999 రూపాయల నుంచి టికెట్ ధరలను ఎయిర్ ఏషియా ఆఫర్ చేసింది.
ఇక చెన్నై నుంచి బెంగళూరు మీదుగా థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ కు3999 రూపాయల నుంచి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications