చెన్నై: భారత్‌లో చౌక ధరలకే విమానయాన సేవలను అందిస్తోన్న సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ మిత్తు చాండిల్య రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను ఆ గ్రూపు చీఫ్ టోర్నీ ఫెర్నాండెజ్ ఖండించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ చాండిల్య ఎయిర్ ఏషియాని వీడట్లేదని ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు.
మేకిన్ ఇండియా వీక్‌లో పాల్గొన్న ఫెర్నాండెజ్ ఈ విషయంపై మీడియా ప్రతినిధులతో స్పందిస్తూ చాండిల్య రాజీనామా చేశారని వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని ఆయన కొట్టిపారేశారు. అనంతరం కంపెనీ విస్తరణ ప్రణాళికల గురించి వివరించారు. త్వరలో రెండు కొత్త విమానాలను, ఆ తర్వాతి కాలంలో డజను విమానాలను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.

అయితే ఈ విమానాలను నిర్దిష్ట కాలపరిమితికి ఎప్పటిలోగా డెలివరీ తీసుకోనున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం ఎయిర్ ఏషియా ఇండియా ఆరు ఎయిర్‌బస్ ఏ320-200 విమానాలతో భారత్‌లో సేవలందిస్తున్నది.
మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియా గ్రూపు, టాటా సన్స్, టెలెస్ట్రా ట్రేడ్‌ప్లేస్‌కు చెందిన అరుణ్ భాటియా భాగస్వామ్యంలో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ భాగస్వామ్యంలో ఎయిర్ ఏషియాకు 49 శాతం, టాటా సన్స్‌కు 41 శాతం, భాటియాకు మిగతా 10 శాతం వాటా ఉంది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications