ఫ్లిప్‌కార్ట్‌లో కళ్యాణ్ జ్యూయలర్స్ ఆభరణాలు (ఫోటోలు)
హైదరాబాద్: కేరళకు చెందిన కళ్యాణ్ జ్యూయలర్స్ ఆన్‌లైన్‌లో బంగారు, వజ్రాభరణాలను విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. ఫిబ్రవరి 12 నుంచి తమ ఆభరణాలను ఆన్‌లైన్ ఈ కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది.
కళ్యాణ్ జ్యూయలర్స్‌ల్లో బాగా ప్రాచుర్యం పొందిన డిజైన్ల ఆభరణాలతో పాటు రింగ్స్, పెండెంట్లు, చెవిపోగులు, నెక్లెస్‌లు రూ. 3,500 నుంచి రూ. 2 లక్షల విలువైన వెయ్యి రకాల మోడళ్లను ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంచుతామని అందులో పేర్కొంది.
దీనిపై కళ్యాణ్ జ్యూయలర్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్ కల్యాణరామన్ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో ఆభరణాల విక్రయం ప్రతిఏటా 70 శాతం వృద్ధిని సాధిస్తూ, ప్రస్తుతం రూ.1,200 కోట్ల స్థాయికి చేరిందని తెలిపారు. ఈ కామర్స్ ద్వారా ఆన్‌లైన్‌లోకి ప్రవేశించడం వెనుక ముఖ్య ఉద్దేశం బహుమతులుగా ఆభరణాలను ఇవ్వగలిగే సత్తా ఉన్న కొనుగోలుదార్లను చేరడం సులభం అవుతుందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జ్యూయలరీ విభాగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ రిషి వాసుదేవ్ తెలిపారు. ఈ భాగస్వామ్యంతో ఆభరణాల విభాగంలో ఇంకో అడుగు ముందుకు వేయనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఈ ఆభరణాల విభాగాన్ని రెండింతలు చేస్తామని అన్నారు.

ఫ్లిప్‌కార్ట్‌లో కళ్యాణ్ జ్యూయలర్స్ ఆభరణాలు
కేరళకు చెందిన కళ్యాణ్ జ్యూయలర్స్ ఆన్‌లైన్‌లో బంగారు, వజ్రాభరణాలను విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. ఫిబ్రవరి 12 నుంచి తమ ఆభరణాలను ఆన్‌లైన్ ఈ కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది.

ఫ్లిప్‌కార్ట్‌లో కళ్యాణ్ జ్యూయలర్స్ ఆభరణాలు
కళ్యాణ్ జ్యూయలర్స్‌ల్లో బాగా ప్రాచుర్యం పొందిన డిజైన్ల ఆభరణాలతో పాటు రింగ్స్, పెండెంట్లు, చెవిపోగులు, నెక్లెస్‌లు రూ. 3,500 నుంచి రూ. 2 లక్షల విలువైన వెయ్యి రకాల మోడళ్లను ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంచుతామని అందులో పేర్కొంది.

ఫ్లిప్‌కార్ట్‌లో కళ్యాణ్ జ్యూయలర్స్ ఆభరణాలు
దీనిపై కళ్యాణ్ జ్యూయలర్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్ కల్యాణరామన్ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో ఆభరణాల విక్రయం ప్రతిఏటా 70 శాతం వృద్ధిని సాధిస్తూ, ప్రస్తుతం రూ.1,200 కోట్ల స్థాయికి చేరిందని తెలిపారు. ఈ కామర్స్ ద్వారా ఆన్‌లైన్‌లోకి ప్రవేశించడం వెనుక ముఖ్య ఉద్దేశం బహుమతులుగా ఆభరణాలను ఇవ్వగలిగే సత్తా ఉన్న కొనుగోలుదార్లను చేరడం సులభం అవుతుందన్నారు.

ఫ్లిప్‌కార్ట్‌లో కళ్యాణ్ జ్యూయలర్స్ ఆభరణాలు
ప్రస్తుతం రాష్ట్రంలో జ్యూయలరీ విభాగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ రిషి వాసుదేవ్ తెలిపారు. ఈ భాగస్వామ్యంతో ఆభరణాల విభాగంలో ఇంకో అడుగు ముందుకు వేయనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఈ ఆభరణాల విభాగాన్ని రెండింతలు చేస్తామని అన్నారు.

Click it and Unblock the Notifications