లండన్: ఐటీ సేవల రంగంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)నిలిచింది. అంతర్జాతీయంగా బ్రాండ్ విలువను గణించే సంస్థ బ్రాండ్ ఫైనాన్స్, 2016కు సంబంధించి వార్షిక జాబితాను ప్రచురించింది.
ఈ జాబితాలో అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా టీసీఎస్ అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక బ్రాండ్లను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించింది. నిబద్ధత, ఉద్యోగుల సంతృప్తి, కార్పోరేట్ గౌరవం, ఉద్యోగుల సంతోషం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది.

ఐటీలో అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా టీసీఎస్
ఈ జాబితాలో 78.3 పాయింట్ల స్కోర్‌తో, ఏఏప్లస్ రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచామని టీసీఎస్ పేర్కొంది. గత 6 ఏళ్ల నుంచి ఐటీ రంగంలో టీసీఎస్ బ్రాండ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఈ జాబితాలో తెలిపింది.

ఐటీలో అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా టీసీఎస్
టీసీఎస్ బ్రాండ్ విలువ 2010లో 2.34 బిలియన్ డాలర్లు(రూ.11,000 కోట్లు)గా ఉంది. అదే టీసీఎస్ బ్రాండు విలువ, 2016 నాటికి 940 కోట్ల డాలర్ల (సుమారు రూ.60,000 కోట్లు)కు పెరిగింది.

ఐటీలో అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా టీసీఎస్
మరోవైపు అన్ని రంగాల పరంగా చూస్తే అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా డిస్ని, అత్యంత విలువైన బ్రాండ్‌గా ఆపిల్ నిలిచాయని తెలిపారు.

ఐటీలో అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా టీసీఎస్
ఐటీ సర్వీసుల రంగంలో తమ విజయంలో కంపెనీలోని 3,44,000 మంది ఉద్యోగుల కృషి ఫలితం ఉందన్నారు. దీంతో పాటు తమ ఖాతారులే అతి ముఖ్యమని, వారికి నాణ్యమైన సేవలు అందించడం వల్లే అగ్రస్థాయి ఐటీ కంపెనీగా ఎదిగామని టీసీఎస్ సీఈఓ, ఎండీ, ఎన్. చంద్రశేఖరన్ అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications