ముంబై: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది తొమ్మిది మంది పారిశ్రామిక దిగ్గజాలను ప్రతిష్టాత్మక ‘పద్మ' అవార్డులకు ఎంపిక చేసింది. రిలయన్స్ ఇండస్ర్టీస్ గ్రూపు వ్యవస్థాపకుడు దివంగత ధీరూభాయ్ అంబానీలకు భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండోదిగా భావించే పద్మ విభూషణ్ పురస్కరాన్ని ప్రకటించింది. 2002లోనే ధీరూభాయ్ కన్నుమూశారు.
ధీరూభాయ్ అంబానీకి పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంపై ఆయన కుమారులు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘స్టార్టప్‌లను ఏర్పాటు చేయాలనే భారతీయ స్ఫూర్తికి' లభించిన గౌరవంగా ఆర్‌ఐఎల్ ఛైర్మన్, ధీరూభాయ్ పెద్ద కుమారుడు ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మాట్లాడుతూ ‘స్టార్టప్‌ను ఏర్పాటు చేసి, పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనే కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం తపిస్తున్న కోట్ల మంది యువత స్ఫూర్తిలో, ధీరూభాయ్ నిలిచే ఉన్నారు. అంతకుముందు ఎవరూ సృష్టించనంత భారీమొత్తం సంపదను తన జీవితకాలంలో ధీరూభాయ్ దేశీయులకు ఆర్జించి పెట్టార'ని అన్నారు.
నిర్మాణ రంగానికి చెందిన పారిశ్రామిక దిగ్గజం, ఎస్‌పీజీ గ్రూప్ గౌరవ ఛైర్మన్ పల్లోంజీ మిస్త్రీ, మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్.సి. భార్గవ, బెనెట్ అండ్ కోల్‌మన్ ఛైర్‌పర్సన్ ఇందుజైన్‌లకు పద్మభూషణ్ ప్రకటించారు. ఢిల్లీకి చెందిన పారిశ్రామికవేత్తలు మహేశ్ శర్మ, సౌరవ్ శ్రీవాస్తవ, మహారాష్ట్రకు చెందిన దిలీప్ సంఘ్వి, కేకి హార్ముష్‌జీ ఘర్దాలకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అవినాశ్ దీక్షితని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మ విభూషణ్‌తో సత్కరించబోతోంది. మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగాకు ప్రవాసభారతీయుల విభాగంలో పద్మశ్రీ వరించింది.

ధీరూభాయ్ అంబానీ
ధీరూభాయ్ అంబానీగా సుపరిచితులైన ధీరజ్‌లాల్ హీరాచంద్ ధీరూభాయ్ అంబానీ డిసెంబర్ 28, 1932లో గుజరాత్‌లోని మారుమూల గ్రామంలో ఒక ఉపాధ్యాయుని కుటుంబంలో జన్మించారు. బతుకు తెరువు కోసం 1949లో భార్యా, పిల్లలను ముంబైలో వదిలి ఉద్యోగం కోసం ఎమెన్‌లో వెళ్లి అక్కడ పెట్రోల్ బంకుల్లో సహాయకుడిగా, గుమస్తాగా పని చేశారు. భారత తిరిగి వచ్చాక వస్త్ర వ్యాపారంతో ప్రారంభించి అంచెలంచెలుగా దేశంలోని మేటి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. టెక్స్‌టైల్స్ నుంచి పెట్రో రిఫైనరీల వరకు ఆయన ఏర్పాటు చేసిన రిలయన్స్ ఇండస్ర్టీస్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. జూలై 6, 2002న ధీరూభాయ్ అంబానీ చనిపోయే నాటికి రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యం వార్షిక టర్నోవర్ రూ.75,000 కోట్లకు విస్తరించింది. కుమారులు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ ప్రస్తుతం ఆయన సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తున్నారు.

పల్లోంజి షాపూర్జీ మిస్త్రీ
పల్లోంజి షాపూర్జీ మిస్ర్తీ దేశంలోని అత్యంత సంపన్నుల్లో ఐదో వ్యక్తి. భారతతో పాటు అనేక దేశాల్లో ఈయనకు నిర్మాణ రంగ కంపెనీలున్నాయి. వీటికి తోడు టాటా గ్రూపు కంపెనీలను నిర్వహించే ‘టాటా సన్స్' హోల్డింగ్స్ కంపెనీలో 18.4 శాతం వాటా ఈయన చేతిలో ఉంది. 2015 నాటికి మిస్ర్తీ సంపద విలువ 1470 కోట్ల డాలర్లు ఉంటుందని ఫోర్బ్స్ పత్రిక ఇటీవల అంచనా వేసింది. ఈయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ప్రస్తుతం షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ పగ్గాలను తన పెద్ద కుమారుడు షాపూర్‌కు అప్పజెప్పారు. ఈయన చిన్న కుమారుడు సైరస్ మిస్త్రీ.. రతన్ టాటా పదవీ విరమణ అనంతరం టాటా సన్స్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తాజ్ మహల్ ప్యాలెస్, ద ఒబెరాయ్ హోటల్స్.. ఈ రెండింటినీ నిర్మించింది ఎస్‌పీజీ గ్రూపే కావడం విశేషం.

దిలీప్ సంఘ్వి
కోల్‌కతా యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన సంఘ్వి 1962లో సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీని ప్రారంభించారు. మే, 2012 నుంచి ఈ కంపెనీకి ఎండిగా కొనసాగుతున్నారు. సన్‌ఫార్మాను దేశంలోని ప్రముఖ ఔషధ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దిన సంఘ్వి స్టాక్ మార్కెట్ ఊపుతో ఒక దశలో ముకేశ్ అంబానీని పక్కకు నెట్టి దేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. రాన్‌బాక్సీ కంపెనీని కొనుగోలు చేసి ఔషధ రంగంలో పట్టు పెంచుకున్న సంఘ్వి ఇపుడు పవన విద్యుత రంగంపైనా కన్నేశారు. ఇందులో భాగంగా ఇటీవల ప్రముఖ పవన విద్యుత మరల తయారీ కంపెనీ సుజలాన్‌లో పెద్ద మొత్తంలో వాటా కొనుగోలు చేశారు.

సౌరభ్ శ్రీవాస్తవ
సౌరభ్ శ్రీవాస్తవ అమెరికా ఐటి దిగ్గజం సిఎ టెక్నాలజీస్‌ని మన దేశంలో విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 50కిపైగా స్టార్టప్ కంపెనీలకు నిధులు సమకూర్చిన శ్రీవాస్తవ భారతతో పాటు యుకెకు చెందిన అనేక ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల బోర్డుల్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఐఐఎస్ ఇన్ఫోటెక్ అనే సంస్థకు ఈయన అధిపతి, వ్యవస్థాపకుడు కూడా. ఏర్పాటు చేసిన నాలుగేళ్లలోనే టాప్-20 భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటిగా దీనిని నిలిపారు. విలీనానంతరం జెన్సాగా పేరు మారిన ఈ కంపెనీని స్టెరియా అనే సంస్థకు విక్రయించారు.

అజయ్ బంగా
మాస్టర్‌కార్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా అజయ్ బంగా(55) జులై 1, 2010 నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే కంపెనీకి ప్రెసిడెంట్‌గా 2009 నుంచి వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు 13 సంవత్సరాలు సిటీబ్యాంక్‌లో, రెండే ళ్లు పెప్సీకోలో పని చేశారు. దేశంలో మాస్టర్‌కార్డుని పాపులర్ చేయడంలో బంగా కీలక పాత్ర వహించారు. అక్కడ దేశవ్యాప్తంగా కంపెనీ ఫ్రాంచైజీలను నెలకొల్పడంలో తన ముద్రను వేశారు.More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications