న్యూఢిల్లీ: ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలోని దేశాల్లో సంపన్నులు (మిలియనీర్లు) అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాల్గవ స్ధానంలో నిలిచింది. న్యూ వరల్డ్ వెల్త్ సంస్ధ ‘ఆసియా పసిఫిక్ 2016 వెల్త్ రిపోర్ట్' పేరిట ఓ నివేదికను ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం 2.36 లక్షల మంది సంపన్నులు దేశంలో ఉన్నారని అందులో పేర్కొంది.
ఆసియా పసిఫిక్ దేశాల్లో మొత్తం 35 లక్షల మంది సంపన్నులు ఉండగా, వీరి సంపద విలువ 17.7 లక్షల కోట్ల డాలర్లని పేర్కొంది. 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.6.7 కోట్ల) వ్యక్తిగత సంపద కలిగిన వారితో సంస్థ ఈ నివేదిక రూపొందించింది. గత 15 సంవత్సరాల్లో వీరి సంఖ్య 115 శాతం పెరిగింది. ఈ జాబితాలో 12.60 మంది సంపన్నులతో జపాన్ అగ్రస్థానంలో ఉంది.
ఆ తర్వాత 6.54 లక్షల మందితో చైనా 2వ స్థానంలో, 2.90 లక్షల మందితో ఆస్ట్రేలియా 3వ స్థానంలో నిలిచాయి. 2.24 లక్షల మందితో సింగపూర్ 5వ స్థానం, 2.15 లక్షల మందితో హాంకాంగ్ 6వ స్థానం, 1.25 లక్షల మందితో దక్షిణకొరియా 7వస్థానం, 98,200 మందితో తైవాన్ 8వ స్థానం, 89,000 మందితో న్యూజిలాండ్ 9వస్థానం, 48,500 మందితో ఇండొనేషియా 10వ స్థానంలో నిలిచాయి.

వచ్చే పదేళ్లలో వీరి సంఖ్య మరింతగా పెరుగుతుందని, 2025 నాటికి ఈ ప్రాంతం అత్యధిక సంపన్నులు కలిగిన ప్రాంతంగా నిలుస్తుందని పేర్కొంది. 2025 నాటికి భారత సంపన్నుల జనాభా 105 శాతం పెరిగి 4.83 లక్షలకు చేరుతుందని అంచనా వేసింది.
కాగా, వ్యక్తులందరి సంపద 4,365 బిలియన్ డాలర్లతో ఆసియా పసిఫిక్‌లోని తొలి 5 దేశాల్లో భారత్‌కు చోటు లభించింది. 17,254 బిలియన్ డాలర్ల సంపదతో చైనా అగ్రస్థానంలో నిలిచింది. ఆస్తులు, నగదు, ఈక్విటీలు, వ్యాపారాల్లో వాటాలను సంపదలో భాగంగా లెక్కించారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications