న్యూఢిల్లీ: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థగా ప్రారంభమైన ముద్రా లిమిటెడ్‌ను బ్యాంకుగా మార్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారి కోసం మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రా (ప్రధాన మంత్రి మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజన కింద రుణాలను అందిస్తున్న సంగతి తెలిసిందే.
దీనిద్వారా ఇచ్చే రుణాలకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ముద్రా ఇకపై భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్(సిడ్బి)కి పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా కొనసాగుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది
అంతేకాదు ముద్రా బ్యాంక్.. రీఫైనాన్స్ కార్యకలాపాలతో పాటు వివిధ సేవలు, పోర్టల్ మేనేజ్‌మెంట్, డేటా విశ్లేషణ వంటివి చేపడుతుందని కూడా వెల్లడించింది. ముద్రా యోజన కింద మైక్రో ఎంటర్ ప్రెన్యూర్స్‌కు శిశు, కిషోర్, తరుణ్ స్కీమ్‌ల కింద రుణాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఇకపై బ్యాంకుగా ముద్రా: సిడ్బీకి అనుబంధ సంస్ధ
ముద్రా బ్యాంకుగా మారిన తర్వాత సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు తీసుకునే రూ. లక్ష కోట్లకు పైగా రుణాలకు క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ హామీగా ఉండనుంది. ఈ పథకం కింద రుణాలు తీసుకునే ఆయా సంస్థలు రుణాలు ఎగవేసినా, బ్యాంకులు-ఆర్థిక సంస్థలకు అధిక నష్టభయం లేకుండా ఈ నిధి తోడ్పడుతుంది. 2015, ఏప్రిల్ 8 నుంచి ఈ స్కీమ్ కింద మంజూరైన రుణాలన్నిటికీ ప్రభుత్వ గ్యారంటీ వర్తిస్తుంది.

ఇకపై బ్యాంకుగా ముద్రా: సిడ్బీకి అనుబంధ సంస్ధ
అంతేకాదు నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ(ఎన్‌సీజీటీసీ) ఈ సీజీఎఫ్‌ఎంయూకు ట్రస్టీగా వ్యవహరిస్తుంది. రుణ పోర్ట్‌ఫోలియో ఆధారంగా మొత్తం రుణంలో డిఫాల్ట్ అయిన దానిలో గరిష్టంగా 50 శాతం వరకూ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఈ సీజీఎఫ్‌ఎంయూ గ్యారంటీని అందించేందుకు వీలవుతుంది.
ఇకపై బ్యాంకుగా ముద్రా: సిడ్బీకి అనుబంధ సంస్ధ
2015-16 బడ్జెట్‌లో ప్రతిపాదించిన మేర ముద్రా బ్యాంకును రూ.20,000 కోట్ల రీఫైనాన్స్ నిధితో, క్రెడిట్ గ్యారెంటీ ఫండ్‌ను రూ.3,000 కోట్ల కార్పస్‌తో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై)ను 2015 ఏప్రిల్‌లో, సిడ్బీ కార్పొరేట్ అనుబంధ సంస్థగా ముద్రా లిమిటెడ్‌ను 2015 మార్చిలో ప్రారంభించారు.

ఇకపై బ్యాంకుగా ముద్రా: సిడ్బీకి అనుబంధ సంస్ధ
మొదటి విడతగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ.20,000 కోట్లు కేటాయించగా, రీఫైనాన్స్‌గా ముద్రా రూ.5,000 కోట్లు అందుకుంది. ప్రస్తుతం ముద్రా యోజనలో ప్రస్తుతం శిశు, కిశోర్, తరుణ్ పేర్లతో మూడు రకాల రుణాలు అందుబాటులో ఉన్నాయి. శిశు విభాగంలో రూ.50,000 వరకూ, కిశోర్ విభాగంలో రూ.50,000 పైబడి రూ.5 లక్షల వరకూ రుణాలు లభిస్తాయి. ఇక తరుణ విభాగంలో రూ.5 లక్షలపైన, రూ. 10 లక్షల వరకూ రుణ సదుపాయం ఉంటుంది.


Click it and Unblock the Notifications