ముంబై: అమెరికాలో 30 ఏళ్ల లోపు అద్భుత విజయాలు సాధించిన వారితో ఫోర్బ్స్ ఓ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో భారత్, భారత సంతతికి చెందిన 45 మందికి స్థానం లభించింది. వివిధ రంగాల్లో కీలక మార్పులు సృష్టించి, అందులో సరికొత్త శకానికి నాంది పలికిన వారితో ఫోర్బ్స్ ఈ జాబితా విడుదల చేసింది.
ఫోర్బ్స్ '30 అండర్ 30' అనే పేరుతో ఐదో వార్షిక జాబితాలో మొత్తం 600 మంది మహిళలు, పురుషులు చోటు దక్కించుకున్నారు. సాంకేతికత, విద్య, ప్రసార మాధ్యమాలు, తయారీ, పరిశ్రమలు, శాసనాలు, చట్టాలు, సామాజిక వ్యాపారవేత్తలు, సైన్స్, లలిత కళలు వంటి రంగాల్లో పెను మార్పులు తీసుకురావటంలో క్రియేటివ్ లీడర్లుగా ఎదిగారని ఫోర్బ్స్ పేర్కొంది.

30లోపు ఫోర్బ్స్ అచీవర్స్: 45 మంది మనవాళ్లే
కన్య్సూమర్ టెక్ విభాగంలో ఓయో రూమ్స్ ఫౌండర్, సీఈఓ 22 ఏళ్ల రితేష్ అగర్వాల్... హాస్పిటాలిటీ రంగంలో పెను విప్లవాన్నే సృష్టించారని పేర్కొంది. ఇదే విభాగంలో స్ప్రిగ్ మొబైల్ యాప్ వ్యవస్థాపకులు గగన్ బియానీ, నీరజ్ బెర్రీలు, మూన్‌షాట్ ఫ్యాకర్టీగా పిలిచే ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ ఎక్స్ యువ ఉద్యోగిని కరిష్మా షాలు స్థానం సంపాదించారు.

30లోపు ఫోర్బ్స్ అచీవర్స్: 45 మంది మనవాళ్లే
ఆర్థిక రంగం నుంచి సిటీ గ్రూప్ ఉపాధ్యక్షురాలు నీలా దాస్, వికింగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడి విశ్లేషకురాలు దివ్య నెట్టిమి, మిలీనియం మేనేజ్‌మెంట్‌లో సీనియర్ విశ్లేషకుడు వికాస్ పటేల్, కాక్స్‌టన్ అసోసియేట్ విశ్లేషకుడు నీల్ రాయ్‌లకు జాబితాలో స్థానం లభించింది.

30లోపు ఫోర్బ్స్ అచీవర్స్: 45 మంది మనవాళ్లే
నీటిలో మునిగిన విమానాలు, చమురు ట్యాంకర్ల వంటి వాటిని అన్వేషించే డ్రోన్లను అభివృద్ధి చేసిన సంప్రీతి భట్టాచార్య, సెమ్‌ట్రెక్స్ సీఈఓ సాగర్ గోవిల్ తయారీ రంగంలో చోటు దక్కించుకున్నారు. చట్టాలు, విధానాల రంగం నుంచి యూఎఫ్ ఫెడ్ బోర్డులో ద్రవ్య పరపతి నిపుణుడు ఆశిష్ కుంభట్, ఫేస్‌బుక్ ప్రైవసీ, పబ్లిక్ పాలసీ సలహాదారు దీపాయన్ ఘోష్‌లకు జాబితాలో స్థానం లభించింది.

30లోపు ఫోర్బ్స్ అచీవర్స్: 45 మంది మనవాళ్లే
వెంచర్ క్యాపిటల్ విభాగం నుంచి గ్రేసాఫ్ట్ పార్ట్‌నర్స్‌లో సీనియర్ అసోసియేట్ విశాల్ లుగానీ, న్యూఎంటర్‌ప్రైజ్ అసోసియేట్స్‌కు చెందిన అమిత్ ముఖర్జీ ఉన్నారు. సామాజిక వ్యాపారవేత్తల్లో శానిటేషన్ అండ్ హెల్త్‌రైట్స్ వ్యవస్థాపక డైరెక్టర్ అనూప్ జైన్‌కు చోటు దక్కింది.

30లోపు ఫోర్బ్స్ అచీవర్స్: 45 మంది మనవాళ్లే
వీరితో పాటు 28 ఏళ్ల గగన్ బియానీ, నీరజ్ బెర్రీ, మూన్‌షాట్ ఫ్యాక్టరీగా వ్యవహరించే గూగుల్ ఎక్స్‌లో పనిచేస్తున్న కరిష్మా షా, హాలీవుడ్‌లో రచయిత, కమెడియన్‌గా ఉన్న కెనడియన్ లిల్లీ సింగ్, వైకింగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్‌లో ఇన్వె్‌స్టమెంట్ అనలిస్ట్ దివ్యా నెట్టిమి, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ఆల్ఫా ఫండ్ నిర్వహిస్తున్న వికాస్ పటేల్, కాక్స్‌టన్ అసోసియేట్స్ అనలిస్ట్ నీల్ రాయ్ ఉన్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications