న్యూఢిల్లీ: వచ్చే ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌పై సలహాలు, సూచనలను ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ మంత్రులను కోరారు. అంతేకాదు బడ్జెట్‌పై ప్రజా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో http://mygov.nic.in పోర్టల్ ద్వారా సలహాలు, సూచనలు కేంద్ర ప్రభుత్వానికి పంపేలా ఏర్పాట్లు చేసింది. బడ్జెట్ ప్రక్రియలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
వచ్చే ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను రూపొందించే ప్రక్రియను కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే ప్రారంభించారు. ఈ క్రమంలో వాణిజ్య సంఘాలు, పారిశ్రామిక వర్గాలు, ఆర్థివేత్తలు, సామాజిక కార్యకర్తలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని బడ్జెట్ బృందంలో ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా, ముఖ్యఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, నీతి ఆయోగ్ వైస్ ఛెర్మన్ అరవింద్ పనగరియా తదితరులు ఉన్నారు.
ప్రతి ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే క్రమంలో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలైంది. 2015-16 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టనున్న సాధారణ, రైల్వే బడ్జెట్లో సామాన్యుల ఆశలు, ఆకాంక్షలకు చోటు లభించిందని ప్రభుత్వం తెలిపింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications