ముంబై: న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖ విమానయాన సంస్ధలు వరుసగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వేరే ఇతర విమానయాన సంస్థలతో పోటీ పడుతూ అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దేశీయ, విదేశీ టిక్కెట్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
సోమవారం స్పైస్‌జెట్ రూ. 716కే దేశీయ మార్గంలో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించిన నేపథ్యంలో తాజాగా న్యూఇయర్ సందర్భంగా ఎయిర్ ఇండియా రెండు పథకాలను ప్రకటించింది. అందులో ఒకటి ‘న్యూ ఇయర్ స్పెషల్' కాగా.. రెండోది ‘లక్కీ ఫస్ట్'.
న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ కింద మెట్రో నగర మార్గాల్లో ప్రయాణానికి అన్ని రుసుములు కలిపి ఒక వైపు టికెట్‌ని రూ. 5,016కే అందించనున్నట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల మధ్య ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.

‘లక్కీ ఫస్ట్' పథకంలో భాగంగా ఢిల్లీ-ముంబై-ఢిల్లీ మార్గంలో బీ777 విమాన ఎకానమీ, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వారు ఉచితంగా ఫస్ట్ క్లాస్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే వెసులుబాటుని కల్పించింది. దీని కోసం ఎయిర్ఇండియా ఓ లక్కీ డ్రాను సైతం నిర్వహిస్తుంది.
ఈ ఆఫర్ జనవరి 1 నుంచి 15 వరకు మాత్రమే వర్తిస్తుంది. కాగా దేశీయ విమాన దిగ్గజం జెట్ ఎయిర్‌వేస్ కూడా న్యూఇయర్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. దేశీయ విమాన టిక్కెట్లపై 5శాతం, కొన్ని ఎంపిక చేసిన విదేశీ రూట్ల టిక్కెట్లపై 10శాతం మేర డిస్కౌంట్‌ని ప్రకటిస్తున్నట్లు తెలిపింది.
ఆఫర్ల కింద టిక్కెట్ల బుకింగ్ మంగళవారం రాత్రి వరకు బుక్ చేసుకోవచ్చునని పేర్కొంది. ఈ టిక్కెట్లను 2016 జనవరి 16 నుంచి ఏప్రిల్ 23లోపు వినియోగదారులు ఉపయోగించు కోవచ్చునని ఒక ప్రకటనలో పేర్కొంది.


Click it and Unblock the Notifications