న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారానికి అనుకూలమైన దేశాల్లో భారత్ 97వ స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ 2015వ సంవత్సరానికి గాను వ్యాపార సానుకూల దేశాల జాబితాను విడుదల చేసింది.
మొత్తం 144 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్‌కు 97వ స్థానం లభించింది. కజఖస్థాన్(57), ఘనా(79) వంటి దేశాలతో పోలిస్తే మనం వెనుకబడే ఉండటం గమనార్హం. పొరుగు దేశమైన శ్రీలంక(91) కూడా మనకంటే మెరుగైన స్థానంలో ఉంది.

వ్యాపార సానుకూల దేశాల్లో భారత్‌కు 97వ స్థానం
మరో రెండు పొరుగు దేశాలైన పాకిస్థాన్(103), బంగ్లాదేశ్ (121) మాత్రం మనకంటే వెనుకబడే ఉన్నాయి. కాగా, ఈ జాబితాలో డెన్మార్క్ మొట్టమొదటి స్థానంలో నిలిచింది. అగ్రరాజ్యం అమెరికా గతేడాదితో పోలిస్తే ఏకంగా నాలుగు స్ధానాలు కోల్పోయి 22వ స్థానంలో నిలిచింది.

వ్యాపార సానుకూల దేశాల్లో భారత్‌కు 97వ స్థానం
2009లో ఈ జాబితాలో రెండో స్థానం దక్కించుకున్న అమెరికా గడిచిన ఆరేళ్లలో క్రమంగా స్థానాలు కోల్పోతూ వచ్చింది. బ్రిటన్ 10 స్థానంలో నిలవగా జపాన్ 23వ స్థానానికి ఎగబాకింది. జర్మనీ 18వ స్థానం దక్కించుకోగా, గతేడాది జాబితాలో 97వ స్థానం నిలిచిన చైనా ఈసారి 94వ స్థానానికి చేరుకుంది.

వ్యాపార సానుకూల దేశాల్లో భారత్‌కు 97వ స్థానం
17.4 లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచ ఆర్ధిక రాజధానిగా అమెరికా మొదటి స్థానంలో ఉంది. 10.4 లక్షల కోట్ల డాలర్లతో చైనా ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. వర్ధమాన దేశాల్లో ఓపెన్ మార్కెట్ ఆర్ధిక వ్యవస్థగా భారత్, ఇంకా పాతపడిన విధానాలను అవలంబిస్తున్న కారణంగా 97వ స్థానంలో నిలిచిందని ఫోర్బ్స్ పేర్కొంది.

వ్యాపార సానుకూల దేశాల్లో భారత్‌కు 97వ స్థానం
వాణిజ్యం, ఆర్థిక స్వేచ్ఛతో పాటు అవినీతి, హింసను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశాల్లో భారత్ పేలవమైన ప్రదర్శన కనబర్చిందని పేర్కొంది. అధిక వ్యయం, సబ్సిడీల్లో దుబారా, ప్రాథమిక, ఉన్నత విద్యలో నాణ్యత లేమి, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు వంటి సవాళ్లతోనూ ఇండియా సతమతమవుతున్నదని పేర్కొంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications