న్యూఢిల్లీ: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ రాజీవ్ బన్సల్ క్యాబ్ సర్వీసుల సంస్ధ 'ఓలా'లో హెడ్ ఫైనాన్స్ ఆపరేషన్స్‌గా చేరారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆయన ఓలా కోర్ లీడర్ షిప్ టీంలో చేరనున్నారని ఓలా ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుత సీఎఫ్ఓ మితీష్ షా, బన్సాల్ టీంలో స్ట్రాటజిక్ ఫైనాన్స్ విభాగానికి అధిపతిగా ఉంటారని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ వెల్లడించారు. భారత్‌లో ఓలా క్యాబ్ సర్వీసుని మరిన్ని పట్టణాలకు విస్తరించే ఆలోచనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.

'ఓలా' ఫైనాన్స్ హెడ్‌గా ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో రాజీవ్ బన్సాల్ సుదీర్ఘకాల అనుభవం తమకెంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఫైనాన్స్ విభాగంలో రాజీవ్ బన్సాల్‌కు 21 ఏళ్ల అనుభవం ఉంది. ఇందులో 16 ఏళ్ల పాటు ఇన్ఫోసిస్‌లోనే పనిచేశారు.

'ఓలా' ఫైనాన్స్ హెడ్‌గా ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ
శరవేగంగా ఎదుగుతున్న, నిత్యమూ వేలాది మంది క్యాబ్ సేవలను దగ్గర చేస్తున్న సంస్థ భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరించనుంది. భవిష్ నాయకత్వంలో ఓలా అద్భుతమైన పురోగతని సాధిస్తుందని, కస్టమర్లు, స్టాక్ హోల్డర్స్ ఓలాపై ఎంతో విశ్వాసాన్ని ఉంచారని పేర్కొన్నారు.

'ఓలా' ఫైనాన్స్ హెడ్‌గా ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ
ఓలాలో చేరేందుకు తానెంతో ఉత్సుకతతో ఉన్నానని రాజీవ్ బన్సాల్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌లో తన పదవికి రాజీనామా చేసినప్పటికీ డిసెంబర్ వరకూ సీఎఫ్ఓ, ఇన్ఫోసిస్ బోర్డుకు సలహాదారుగా ఉండేందుకు రాజీవ్ బన్సాల్ అంగీకరించారు.

'ఓలా' ఫైనాన్స్ హెడ్‌గా ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ
దీనివల్లనే ఓలాలో చేరేందుకు ఆయన జనవరి వరకూ సమయం తీసుకున్నారు. రాజీవ్ బన్సాల్ ఇన్ఫోసిస్‌లో చేరడానికి ముందు టాటా టెక్నాలజీస్, కేబుల్ & వైర్‌లెస్, ఏబీబీ లాంటి కంపెనీల్లో పనిచేశారు. ఇక ఓలా విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో స్టార్టప్ కంపెనీల్లో అధ్భుతమైన కంపెనీగా ఎదిగింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications