ఐఐటీ కుర్రాడి ఘనత: వయసు 22, జీతం 2 కోట్లు
హైదరాబాద్: ఐఐటీ ఖరగ్ పూర్‌కు చెందిన ఓ విద్యార్ధి గూగుల్ నుంచి భారీ ఆఫర్ దక్కించుకున్నాడు. పూణెకు చెందిన అభిషేక పంత్ సెర్చ్ ఇంజన్ దిగ్గజ కంపెనీ గూగుల్‌లో స్టాక్ ఆప్షన్‌తో సహా భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు.
అభిషేక్ వయసు 22 ఏళ్లు. ఖరగ్ పూర్‌లోని ఐఐటీలో కంప్యూటర్ సైన్సు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అంతేకాదు ఈ ఏడాది ప్రథమార్ధంలో పలు రౌండ్ల ఇంటర్వ్యూల అనంతరం కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో మూడు నెలల ఇంటర్న్ షిప్ కూడా పూర్తి చేశాడు.

ఐఐటీ కుర్రాడి ఘనత: వయసు 22, జీతం 2 కోట్లు
దీంతో అభిషేక్‌ను డిజైన్ సొల్యూషన్ విభాగంలోకి తీసుకున్నారు. అమెరికాలో పుట్టి పెరిగిన అభిషేక్ పంత్ కుటుంబ సభ్యులతో సహా 2006లో పూణెకు వచ్చాడు. ఇక్కడే చదువును పూర్తి చేశాడు. అయితే గూగుల్‌లో ఉద్యోగం రావడంతో మళ్లీ కాలిఫోర్నియాకు వెళ్లనున్నాడు.

ఐఐటీ కుర్రాడి ఘనత: వయసు 22, జీతం 2 కోట్లు
వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో అతడు ఉద్యోగంలో చేరనున్నాడు. యూజర్లు లేవనెత్తే సమస్యలను పరిష్కరించే డిజైన్ సొల్యూషన్‌లో విధులు నిర్వర్తించనున్నాడు. కాగా, తమ విద్యార్థుల్లో అభిషేక్ పంత్ కు దక్కిన ప్యాకేజీయే అత్యధికమో, కాదో ఇప్పుడే చెప్పలేమని ఖరగ్ పూర్ ఐఐటీ పేర్కొంది.

ఐఐటీ కుర్రాడి ఘనత: వయసు 22, జీతం 2 కోట్లు
అభిషేక్ సీబీఎస్ టెన్త్ పరీక్షలో 97.6 శాతం మార్కులతో పూణెలో టాపర్‌గా నిలిచాడు. గూగుల్ సంస్థలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం రావడం పట్ల అభిషేక్ ఆనందం వ్యక్తం చేశాడు.

ఐఐటీ కుర్రాడి ఘనత: వయసు 22, జీతం 2 కోట్లు
పూణె నుంచి ఖరగ్ పూర్‌కు, అక్కడి నుంచి కాలిఫోర్నియాకు తన జర్నీ చాలా ఆసక్తికరంగా సాగిందని పేర్కొన్నాడు. సరికొత్త ఇంజినీరింగ్ సవాళ్లతో కూడిన విధులు నిర్వర్తించబోతున్నందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications