న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత విలువైన దేశీయ బ్రాండ్ల జాబితాలో భారత్‌కు ఏడో స్ధానం దక్కింది. గతేడాది 8వ స్థానంలో నిలిచిన భారత్ తన బ్రాండ్ విలువను ఈ ఏడాది 32 శాతం మెరుగుపరుచుకొని 210 కోట్ల డాలర్లతో ఏడోస్థానంలో నిలిచింది.
ఈ జాబితాలోని అత్యుత్తమ 20 దేశాల్లో ఏ దేశ బ్రాండ్ విలువ కూడా ఈ స్థాయిలో పెరగకపోవడం గమనార్హం. 100 దేశాల బ్రాండ్ విలువలతో కూడిన నివేదికను బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసింది. 2015 సంవత్సరానికి విడుదల చేసిన జాబితాలో అమెరికా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. యూఎస్ బ్రాండ్ వేల్యూ 1970 కోట్ల డాలర్లుగా నమోదైంది.
ఇక చైనా, జర్మనీ దేశాలు వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకోగా... బ్రిటన్‌కు 4 స్థానం, జపాన్‌కు ఐదో స్థానం లభించింది. ఫ్రాన్స్ 6వ స్థానంలో ఉంది. గతేడాది టాప్-5లో చోటు దక్కించుకున్న దేశాలు ఈ ఏడాదీ అదే స్థానాల్లో నిలిచాయి.

'నేషన్ బ్రాండ్': భారత్‌కు 7వ స్థానం
అత్యుత్తమ 20 దేశాల్లో భారత్ బ్రాండ్ విలువే అధికంగా వృద్ధి చెందింది. అంతేకాదు బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) సభ్య దేశాల్లో బ్రాండ్ విలువ పెరిగిన ఏకైక దేశం కూడా భారతే. చైనా తిరిగి తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నా గత సంవత్సరంతో పోలిస్తే బ్రాండ్ విలువ ఒక శాతం తగ్గి 630 కోట్ల డాలర్లకు పరిమితమైంది.

'నేషన్ బ్రాండ్': భారత్‌కు 7వ స్థానం
బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ దేశంలోని అన్ని బ్రాండ్ల ఆదాయం ఆధారంగా ఆ దేశ బ్రాండ్ విలువను లెక్కిస్తుంది. ఇందులో భాగంగా ఒక్కో బ్రాండ్‌కు సంబంధించి వచ్చే ఐదేళ్ల కాలానికి అమ్మక అంచనాలను పరిగణలోకి తీసుకుంటుంది. దీంతో పాటు బ్రాండ్ విలువ మదింపులో ఆ దేశ స్థూల జాతీయోత్పత్తికి ఎక్కువ ప్రాతినిథ్యం ఉంటుంది.

'నేషన్ బ్రాండ్': భారత్‌కు 7వ స్థానం
ఇంక్రెడిబుల్ ఇండియా నినాదం ఈసారి భారత్‌కు కలిసివచ్చిందని, ఫోక్స్‌వ్యాగన్ సంక్షోభం జర్మనీకి ఇబ్బందిగా మారిందని బ్రాండ్ ఫైనాన్స్ తన నివేదికలో పేర్కొంది. సానుకూల వ్యాపార వాతావరణం కల్పిస్తున్న అమెరికా ఇప్పటికీ అత్యంత విలువైన జాతీయ బ్రాండ్‌గా కొనసాగుతుందని పేర్కొంది.

'నేషన్ బ్రాండ్': భారత్‌కు 7వ స్థానం
కాగా అమెరిగా బ్రాండ్ విలువలో అక్కడి ఉన్నత విద్యా వ్యవస్థతోపాటు మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలు కూడా గణనీయమైన వాటా కలిగి ఉన్నాయని బ్రాండ్ ఫైనాన్స్ తన నివేదిక తెలిపింది. ఒకానొక దశలో అమెరికాను చైనా వెనక్కి నెట్టే అవకాశం పొందనప్పటికీ, ఈమధ్య కాలంలో అక్కడ చోటు చేసుకున్న స్టాక్ మార్కెట్ సంక్షోభం, ఆర్థిక మందగమనం చైనాను రెండో స్థానంలో నిలిచేలా చేశాయని పేర్కొంది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications