ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ విక్రయ సంస్ధగా పేరుగాంచిన వాల్‌మార్ట్ భారత్‌లో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు గాను స్థానిక అధికారులకు భారీగా లంచాలు ముట్టజెప్పిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో వెల్లడించింది. కస్టమ్స్ క్లియరెన్సులు, రియల్ ఎస్టేట్ పర్మిట్లు ఇలా వివిధ అనుమతులు పొందేందుకు అధికారులకు చిన్న మొత్తాల్లో లంచాలు ఇచ్చిందని అమెరికా ప్రభుత్వ దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.
వాల్‌స్ట్రీట్ కథనం ప్రకారం చాలా వరకు చెల్లింపులు 200 డాలర్ల (ప్రస్తుత ఎక్సేంజ్ రేట్ ప్రకారం రూ. 13,000) వరకు జరిగాయని, కొన్ని అయితే 5 డాలర్లు (రూ. 330) వరకూ ఇచ్చి పనులు చక్కబెట్టుకుందని అమెరికా ప్రభుత్వ దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది.
ఇలా మొత్తం
కలిపితే మాత్రం ఈ లంచాల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని తెలుస్తోంది. వాల్ మార్ట్ సంస్ధ 2007లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పట్లో భారతీ ఎంటర్‌ప్రైజెస్ భాగస్వామ్యంతో టోకు వ్యాపారం కొనసాగించిన వాల్‌మార్ట్, 2013లో విడిపోయింది.

అధికారులకు భారీగా వాల్‌మార్ట్ లంచాల ఎర!
అప్పటి నుంచి సొంతంగా భారత్‌లో టోకు విక్రయ స్టోర్లను నిర్వహిస్తుంది. భారత్‌లో వ్యాపార విస్తరణకు గాను అధికారులకు ముట్టజెప్పిన ముడుపుల విలువే అధికమని తెలిపింది. అమెరికా విదేశీ అవినీతి వ్యవహారాల చట్టం(ఎఫ్‌సీపీఏ) ప్రకారం ఇండియా, మెక్సికోలో లంచాలు చెల్లించినందుకు గాను వాల్‌మార్ట్‌పై వేటుపడనుందని ఆ కథనం పేర్కొంది.

అధికారులకు భారీగా వాల్‌మార్ట్ లంచాల ఎర!
ఈ చట్టం ప్రకారం విధించే జరిమానాలు సంస్థ ఆర్జించే లాభాలతో ముడిపడి ఉంటాయని, దీంతో కంపెనీపై భారీ జరిమానా పడే అవకాశాల్లేవని పేర్కొంది. ఎందుకంటే గత ఏడాదిలో వాల్ మార్ట్ సంస్ధ భారత వ్యాపార విభాగం రూ.232 కోట్ల నష్టం చవిచూసింది.

అధికారులకు భారీగా వాల్‌మార్ట్ లంచాల ఎర!
ఆదాయం కూడా 32 శాతం తగ్గి రూ.2,992.7 కోట్లకు పరిమితమైంది. ఎఫ్‌సీపీఏ చట్టం కింద దర్యాప్తును ఎదుర్కొంటున్న వాల్‌మార్ట్ దీనికి సంబంధించి గత ఏడాది నవంబర్‌లో మేనేజర్ స్థాయి వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించింది.

అధికారులకు భారీగా వాల్‌మార్ట్ లంచాల ఎర!
నవంబర్ 2012లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పంకజ్ మదన్‌తోపాటు అప్పటి న్యాయ సలహా బృందంలోని ఐదుగురు ఉద్యోగులకు సంస్థ ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. వాల్ మార్ట్ లంచాలపై కంపెనీని సంప్రదించగా... 'మేం ముందు నుంచీ చెబుతున్నట్లు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నాం. దీనిపై వ్యాఖ్యానించబోమ'ని వాల్‌మార్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రజనీశ్ కుమార్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications