జర్మనీకి చెందిన ఆటో దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ భారత్‌లో ప్రీమియం హ్యాచ్‌బాక్ పోలో విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేయాలని బుధవారం డీలర్లను ఆదేశించింది. తదుపరి ఆదేశాలు అందేవరకూ కొత్త కొనుగోలుదార్లకు డెలివరీ చేయొద్దని తెలిపింది.
ఫోక్స్ వ్యాగన్ కార్లకు సంబంధించి ఒక సాంకేతిక అంశం కారణంగా కార్ల విక్రయాలను ఆపేయమన్నామని కంపెనీ లేఖలో పేర్కొంది. అమ్మకాలు ఆపేయడానికి ప్రస్తుతం అంతర్జాతీయంగా తాము ఎదుర్కొంటున్న కాలుష్యకారక ఉద్గారాల సమస్య కారణం కాదని కంపెనీ స్పష్టం చేసింది.

భారత్‌లో పోలో అమ్మెుద్దు: డీలర్లకు ఫోక్స్ వ్యాగన్
ఫోక్స్ వ్యాగన్ కంపెనీ తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయించిన 1.1 కోటి డీజిల్ కార్ల ఇంజన్ల నుంచి వెలువడే కాలుష్య కారక వాయువుల విడుదలను అమెరికా అధికార్లకు తగ్గించి చూపేందుకు వాటిలో ఒక సాఫ్ట్‌వేర్ అమర్చి, యావత్ ప్రపంచాన్ని మోసం చేసింది.

భారత్‌లో పోలో అమ్మెుద్దు: డీలర్లకు ఫోక్స్ వ్యాగన్
ఈ నేపథ్యంలో జర్మనీ ప్రభుత్వం సహా పలు దేశాలు ఫోక్స్ వ్యాగన్‌పై దర్యాప్తు చేపట్టాయి. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు కాలానికి 20,030 పోలో కార్లను తయారు చేశామని, దేశీయంగా 13,827 కార్లను విక్రయించామని, 6,052 కార్లను ఎగుమతిచేశామని కంపెనీ వివరించింది.

భారత్‌లో పోలో అమ్మెుద్దు: డీలర్లకు ఫోక్స్ వ్యాగన్
కాలుష్య ఉద్గారాల అంశం భారత కార్యకలాపాలపై ఏ మేరకు ప్రభావం చూపనున్నదనే విషయంపై కూడా కసరత్తు చేస్తున్నామని పేర్కొంది. ఈ కసరత్తు ఫలితాలననుసరించి కార్ల రీకాల్‌పై నిర్ణయం తీసుకుంటామని వివరించింది.

భారత్‌లో పోలో అమ్మెుద్దు: డీలర్లకు ఫోక్స్ వ్యాగన్
ఇది ఇలా ఉంటే కాలుష్య నియంత్రణ సంస్థలను మోసపుచ్చే సాఫ్ట్‌వేర్ గల కార్లను తిరిగి సరిచేయడానికి సంవత్సరం పైగా సమయం పట్టేస్తుందని ఫోక్స్‌వ్యాగన్ కొత్త సీఈవో మథయాస్ ముల్లర్ వ్యాఖ్యానించారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications