ముంబై: దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ముంబైలోని జతియా హౌస్ కోసం బిర్లా గ్రూపు అధినేత కుమారం మంగళం బిర్లా రూ. 450 కోట్లు పెట్టి నెలకొల్పిన రికార్డును రోజుల వ్యవధిలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.

ముంబై రియల్టీ: బీకేసీలో ఆఫీస్ ఖరీదు రూ. 1,480 కోట్లు
ముంబైలోని లింకన్ హౌస్‌ను సైరస్ పూనావాలా రూ. 750 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. తాజాగా ఈ రికార్డుని బద్దలు కొడుతూ దేశీయ ఫార్మా దిగ్గజం 'అబాట్ ఇండియా' బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని 4.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని రూ. 1,480 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

ముంబై రియల్టీ: బీకేసీలో ఆఫీస్ ఖరీదు రూ. 1,480 కోట్లు
గోద్రెజ్ ప్రాపర్టీస్, జెట్ ఎయిర్ వేస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘బాంద్రా-కుర్లా కాంప్లెక్స్' (బీకేసీ)లో తన కార్యాలయం కోసం అబాట్ ఇండియా 4.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ బీకేసీ 2016 జూన్‌కు పూర్తి అవుతుంది.

ముంబై రియల్టీ: బీకేసీలో ఆఫీస్ ఖరీదు రూ. 1,480 కోట్లు
2006లో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) నుంచి జెట్ ఎయిర్ వేస్ రూ.399 కోట్లకు కొనుగోలు చేసిన రెండున్నర ఎకరాల స్థలంలో ‘బాంద్రా-కుర్లా కాంప్లెక్స్' ని గోద్రెజ్ ప్రాపర్టీస్‌తో కలిసి నిర్మిస్తుంది.

ముంబై రియల్టీ: బీకేసీలో ఆఫీస్ ఖరీదు రూ. 1,480 కోట్లు
ఈ ప్రాజెక్టులో భాగంగా వచ్చిన లాభాలను గోద్రెజ్ ప్రాపర్టీస్, జెట్ ఎయిర్ వేస్ సమానంగా పంచుకుంటాయి. ఈ డీల్‌పై గోద్రెజ్ ప్రాపర్టీస్ సీఈఓ ఫిరోజ్‌షా గోద్రెజ్ మాట్లాడుతూ ఇంత పెద్ద డీల్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ‘బాంద్రా-కుర్లా కాంప్లెక్స్' (బీకేసీ)లోని మరింత స్పేస్‌ను అమ్మకానికి ఉంచినట్లు ఆమె తెలిపారు.


Click it and Unblock the Notifications