హైదరాబాద్: డిజిటల్ ఇండియా కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ పాలుపంచుకోనుందని ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. ఇందులో భాగంగా భారత్‌లోని 5 లక్షల గ్రామాల్లో మైక్రోసాప్ట్ చౌకగా బ్రాడ్‌బ్యాండ్ సేవలందించాలని అనుకుంటుందని తెలిపారు.
అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రముఖ సంస్థల సీఈవోలతో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి హాజరైన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల మాట్లాడుతూ చౌక బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీకి క్లౌడ్ కంప్యూటింగ్ పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలు, వ్యాపారాలన్నింటిలోనూ సృజనాత్మకతను, ఉత్పత్తిని, సామర్థ్యాన్ని పెంచవచ్చన్నారు.

5 లక్షల గ్రామాలకు చౌకగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు
భారత్‌లోని సంస్థ డేటా సెంటర్ల ద్వారా అందుబాటులోకి తేనున్న క్లౌడ్ సేవలపై వచ్చేవారం ప్రకటన చేయన్నునట్లు ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ పాఠశాలలో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహించటం నిజంగా అద్భుతమని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రశంసించారు.

5 లక్షల గ్రామాలకు చౌకగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు
డిజిటల్ ఇండియా ప్రజల జీవితాల్లో ఏ విధమైన మార్పులు తీసుకురాగలదనేందుకు ఉదాహరణగా సత్య నాదెళ్ల తనకు ఇప్పటికీ గుర్తుకు వచ్చే చిన్ననాటి సంగతిని ప్రస్తావించారు. సన్నగా ఉన్న ఇద్దరు వ్యక్తులు నులక మంచంపై బోర్లా పడుకుని ఎవరికి వారు రేడియో వింటున్నారు.

5 లక్షల గ్రామాలకు చౌకగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు
వారిద్దరూ కూడా టీచర్ వృత్తిలో భోధించడం మానేయాలని నిర్ణయించుకున్న టీచర్లు. నాకు వారిప్పటికీ గుర్తుకొస్తుంటారు. ఇప్పుడైతే వారు ఏం సాధించగలిగేవారోనని అన్నారు. ఇది తన సొంతూరు శ్రీకాకుళంలో, 1970లో జరిగిన సంఘటన అని నాదెళ్ల చెప్పారు.

5 లక్షల గ్రామాలకు చౌకగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు
ఆంధ్రప్రదేశ్‌లో డ్రాపవుట్స్ వివరాలు తెలుసుకునేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారన్నారు. చిన్న వ్యాపారులకు క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగపడుతుందని వివరించారు. ప్రపంచంలోని ప్రజలందరి సాధికారత దిశగా పని చేసేందుకు ఇది సమయమని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications