మెటల్స్, మైనింగ్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేదాంత రీసోర్సెస్ ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 4,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పింది. వేదాంత రీసోర్సెస్ యాజమాన్యం నిర్వహిస్తున్న కంపెనీల్లో వేదాంత అల్యూమినియం, బాల్కో, కెయిర్న్ ఇండియా, సెసాగోవా ఉన్నాయి.

వేదాంతలో 4,000 మందికి ఉద్వాసన
జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ కంపెనీలన్నింటిలోనూ 2,700 మంది ప్రత్యక్షంగా పని చేస్తున్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించగా, మిగిలిన వారు పరోక్షంగా పనిచేస్తున్నారు.

వేదాంతలో 4,000 మందికి ఉద్వాసన
కంపెనీ ఇండియా విభాగాలైన బాల్కోలో 1000 మందిని, వేదాంత అల్యూమినియంలో 2000 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు తెలిసింది. సెసాగోవా, కెయిర్న్ ఇండియాలో కూడా 450 మందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది.

వేదాంతలో 4,000 మందికి ఉద్వాసన
ఉద్యోగులను తొలగించిన విషయాన్ని వేదాంత అల్యూమినియం, బాల్కో, కెయిర్న్ ధ్రువీకరించాయి. బాల్కో పునర్ వ్యవస్థీకరణలో భాగంగా చత్తీస్గఢ్లోని కోర్బా రోలింగ్ మిల్లును మూసివేస్తున్నట్టు ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది.

వేదాంతలో 4,000 మందికి ఉద్వాసన
దీని వల్ల 1000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు నిరుత్సాహపూరితంగా ఉండడంతో ఇనుప ఖనిజం విభాగంలో భారీ వ్యయ నియంత్రణ చేపట్టినట్టు వేదాంత రీసోర్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications