ఈ మెయిల్ ద్వారా పన్ను నోటీసులు (ఫోటోలు)
పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. పన్ను చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. ఇప్పటి వరకు ఆదాయపు పన్ను నోటీసులు పోస్ట్ ద్వారా ఇస్తుండగా, వ్యక్తిగతంగా హాజరై బదులివ్వాల్సి వచ్చేది. దీంతో పన్ను చెల్లింపుదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అనవసరంగా ఒత్తిడి తెస్తున్నారని పలుసార్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకి (సీబీడీటీ) ఫిర్యాదులు వెళ్లాయి.
ఈ నేపథ్యంలో ఆ సమస్యను పరిష్కరించేందుగాను తాజాగా ఈ మెయిల్ సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్లు సీబీడీటీ ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులు తమ వివరణను కూడా ఈమెయిల్ ద్వారా తెలిపే అవకాశం ఈ విధానంలో అందుబాటులోకిరానుంది.

ఈ మెయిల్ ద్వారా పన్ను నోటీసులు
అసెస్సీకి, అధికారులకు మధ్య భారం తగ్గించే దీనికి సంబంధించిన విధి విధానాలపై సీబీడీటీ కసరత్తు చేస్తోంది. నోటీసులు పంపించడం తిరిగి వాటికి బదులు ఇచ్చే అవకాశం ఉండేలా ఈ మెయిల్ సిస్టమ్‌ను తయారు చేయాలని ఇప్పటికే ఐటీ శాఖకు సీబీడీటీ ఆదేశించింది.

ఈ మెయిల్ ద్వారా పన్ను నోటీసులు
గత కొంతకాలంగా పన్ను చెల్లించేందుకు తేలికైనా మార్గాలను అన్వేషిస్తున్నామని సీబీడీటీ చైర్మన్ అనితా కపూర్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఆలోచిస్తున్నామన్నారు.

ఈ మెయిల్ ద్వారా పన్ను నోటీసులు
ఇందులో భాగంగా పన్ను చెల్లింపుదారులకు ఈ-మెయిల్ పంపించేలా, దానికి తిరిగి సమాధానం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పన్ను వసూలు చేసేటప్పులు తలెత్తే ఇబ్బందులు, పన్ను చెల్లింపుదారుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పుకు శ్రీకారం చుట్టినట్లు ఆమె తెలిపారు.
ఈ మెయిల్ ద్వారా పన్ను నోటీసులు
ప్రస్తుతం పన్ను చెల్లింపుదారుడికి పేపర్ డాక్యుమెంట్లను పోస్ట్ ద్వారా పంపిస్తున్నారు. కొత్త విధానం అందుబాటులోకి వస్తే క్షణాల్లో నోటీసులు, ఇతర వాటిని పంపేందుకు వీలుపడనున్నది. అసెసింగ్ ఆఫీసర్‌కు పన్ను చెల్లింపుదారుడికి మధ్య ఎవరికి సంబంధం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకరావడం జరిగిందన్నారు.

ఈ మెయిల్ ద్వారా పన్ను నోటీసులు
ఇతర వివరాలు తెలుసుకోవాలంటే కూడా ఈ-మెయిల్ పంపవచ్చునని ఆమె ఈ సందర్భంగా సూచించారు. పన్ను చెల్లింపునకు చెందిన అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేసి ఈమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications