శ్రావణం: బంగారం ధర పైకి, ఊపందుకున్న విక్రయాలు
బంగారం ధర పుంజుకుంటోంది. మరింతగా పెరిగే ఛాన్స్‌లున్నాయని మార్కెట్ వర్గాలంటున్నాయి. శ్రావణ మాసం రాకముందు కొంత ధర తగ్గినట్టనిపించినా వచ్చాక ధర కిందికి దిగలేదు. పైగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో ధర తగ్గుతుందంటూ విశ్లేషకులు చెబుతున్నా, మేలిమి బంగారం (24 క్యారెట్లు) రూ. 25 వేల దిగువనే ఉంటుందని ప్రకటించినా ఇప్పుడా పరిస్ధితి లేదు.
గ్రాముకు రూ. 250 అదనంగా పెరిగింది. అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్ధలన్నీ కుదేలైనా పసిడి ధర మాత్రం నిలకడను సంతరించుకుంటోంది. ధరలు పెరుగుతున్నా శ్రావణ మాసంలో బంగారం కొనుగోలుకు పసిడి ప్రియులు వెనుకాడడం లేదు. ఆగ్సటు 6న నగర బులియన్ మార్కెట్లో బంగారం ధర కనిష్ట స్థాయికి చేరుకుంది.
అప్పట్లో ఆర్నమెంట్ బంగారం రూ. 2300 ఉండేది. ఇంకా తగ్గుతుందుని భావించి అప్పుడు కొనని వారంతా ఇప్పుడు ఎగబడుతున్నారు. ఇప్పుడున్న ధరలు రేపు ఉండవేమోనని ఆందోళన వారిలో కనిపిస్తోంది. దీంతో బంగారం షాపులన్నీ శ్రావణ శోభను సంతరించుకున్నాయి.

రెండో శుక్రవారం (ఈనెల 28న) లక్ష్మీపూజ. ఈ పూజలో కొత్త బంగారం అమ్మవారికి చూపిచడం చాలా ఇళ్లలో ఆనవాయితీ. బంగారం కొనలేని వారు సైతం వెండి ఆభరణాలైనా కొంటారు. ఒకప్పుడు కాసులు కొనేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. జనం ఎక్కువగా బిస్కెట్లవైపు మొగ్గు చూపుతున్నారు.

శ్రావణం: బంగారం ధర పైకి, ఊపందుకున్న విక్రయాలు
వజ్రాభరణాల సంస్కృతి పెరిగిన తర్వాత బిస్కెట్ల బంగారం కోసం ఎగబడుతున్నారు. రెండేళ్ల క్రితం బిస్కెట్ల బంగారం నిలిపివేశారు. మళ్లీ ఇప్పుడు 10 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకూ బిస్కెట్లు జ్యూవెలరీ మాల్స్‌లో లభ్యమవుతున్నాయి.

శ్రావణం: బంగారం ధర పైకి, ఊపందుకున్న విక్రయాలు
ఇటీవల కాలంలో కాసులు కొంటే మోసపోతున్నామనుకునే వారికి ప్యూర్ గోల్డ్ బిస్కెట్లు భరోసాగా నిలుస్తున్నాయి. దీంతో ఈ ఏడాది బిస్కెట్ల అమ్మకాలే భారీగా ఉన్నాయి. ధరలు తగ్గిపోతున్నప్పుడు కొనేవారి కన్నా పెరుగుతున్నప్పటి నుంచి కొనేవారు ఎక్కువయ్యారు. విశ్లేషకుల మాటల సంగతి పక్కనబెట్టి బంగారం తగ్గినప్పుడే కొనుక్కోవడం మంచిది.

Click it and Unblock the Notifications