ఉద్యోగంపై క్రెడిట్ స్కోరు ప్రభావం ఏవిధంగా?

ఇటీవల కాలంలో క్రెడిట్ స్కోరుకి ప్రాధాన్యత పెరిగింది. క్రెడిట్ స్కోరు అంటే ఏమిటీ? బ్యాంకు ఖాతాదారుడు తన ఖాతాలోని నగదుని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాడు? బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే వాటిని సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా నగదు నిల్వలు కొనసాగించడం లాంటి ఎన్నో అంశాలపై ఆధారపడి 'సిబిల్' ఇచ్చే స్కోర్.

సిబిస్ స్కోరు గనుక ఎక్కువగా ఉంటే, ఆ ఖాతాదారుడికి ఎక్కువగా బ్యాంకు సేవలు అందుతాయి. అదే క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే బ్యాంకులు కూడా గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలను ఇచ్చేందుకు వెనుకంజ వేస్తాయి. ఇప్పటివరకూ పశ్చిమ దేశాల్లో ఉద్యోగులను ఎంపిక చేసే కంపెనీలు, నిరుద్యోగుల క్రెడిట్ స్కోరును పరిశీలిస్తుండగా, ఈ ట్రెండ్ తాజాగా ఇండియాలో కూడా మొదలైంది.

ఉద్యోగంపై క్రెడిట్ స్కోరు ప్రభావం ఏవిధంగా?

ఉద్యోగంపై క్రెడిట్ స్కోరు ప్రభావం ఏవిధంగా?

క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే ఆ ఉద్యోగిలో బాధ్యతారాహిత్యం ఎక్కువగా ఉంటే, అది అతని పనితీరుపై ప్రభావం చూపి సంస్థ ప్రొడక్టివిటీని దెబ్బతీస్తుందని కంపెనీలు భావిస్తున్నాయి. దీనిపై ప్రత్యేకంగా కంపెనీలోని మానవ వనరుల విభాగం ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది.

 ఉద్యోగంపై క్రెడిట్ స్కోరు ప్రభావం ఏవిధంగా?

ఉద్యోగంపై క్రెడిట్ స్కోరు ప్రభావం ఏవిధంగా?

నిరుద్యోగి ఉద్యోగం ఇచ్చే ముందు బ్యాక్ గ్రౌండ్‌ను పరిశీలించడంతో పాటు క్రెడిట్ రిపోర్టును కూడా పరిశీలిస్తున్నారు. విద్యార్హతల పరంగా తృప్తిగా ఉన్నప్పటికీ, క్రెడిట్ స్కోర్ బాగాలేకుంటే, వారిని విధుల్లోకి తీసుకోకపోవడమే మంచిదని సంస్థలు భావిస్తున్నాయి. గతంలో ఇచ్చిన రెండు మూడు చెక్కులు బౌన్స్ అయితే దాని ప్రాతిపదికన మరో రుణమిచ్చేందుకు బ్యాంకులు అంగీకరించవు. దీని ప్రభావం క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతుంది.

 ఉద్యోగంపై క్రెడిట్ స్కోరు ప్రభావం ఏవిధంగా?

ఉద్యోగంపై క్రెడిట్ స్కోరు ప్రభావం ఏవిధంగా?

దీంతో పాటు మీరు నెలకు రెండు మూడు సార్లు బార్లకు వెళ్లి ఫ్రెండ్స్‌తో గడిపి అక్కడ మీ కార్డు ద్వారా చెల్లింపులు జరిపితే, మీపై తాగుబోతన్న ముద్ర పడిపోతుంది. క్రెడిట్ కార్డులు వాడుతూ, హైఎండ్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసి, ఆపై ఆ డబ్బును నెలవారీ కనీస మొత్తాలను కడుతూ, తీరుస్తుంటే కూడా మీరు బాధ్యతారాహితంగా ఉన్నారని కంపెనీలు భావిస్తున్నాయి. అంతేకాదు అవసరానికి మించి ఖర్చు పెడుతున్నారని తెలిసిపోతుంది.

ఉద్యోగంపై క్రెడిట్ స్కోరు ప్రభావం ఏవిధంగా?

ఉద్యోగంపై క్రెడిట్ స్కోరు ప్రభావం ఏవిధంగా?

ఆన్‌లైన్‌లో ఈ కామర్స్ వెబ్‌సైట్లు అందిస్తున్నాయి కదా అని, కార్డులు వాడేసి ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నా మీ ఆదాయం ఎంతన్న విషయమై ఆధారపడి క్రెడిట్ స్కోరు మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రతికూల ప్రభావం కూడా పడుతుంది. క్రెడిట్ స్కోరు తగ్గించే అంశాలపై అజాగ్రత్తగా ఉంటే మంచి ఉద్యోగం దూరం అవుతుందని నిపుణుల అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+