న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో బ్లాక్‌మనీ వివరాలను వెల్లడించేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఇందు కోసం అధికారిక వెబ్‌సైట్ https://incometaxindiaefiling.gov.in ఈ-ఫైలింగ్ లింక్‌ను ప్రవేశపెట్టింది.
విదేశాల్లో అక్రమంగా దాచుకున్న ఆస్తులు, ఇతర లావాదేవీలకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు చివరి అవకాశం కల్పిస్తూ, కేంద్ర ఆర్ధిక శాఖ ప్రత్యేక లింక్‌ను ఏర్పాటు చేసింది. దీని గడువు సెప్టెంబర్ 30లోగాముగియనుంది.
ఈ-పైలింగ్‌లో వెల్లడించిన మార్కెట్ విలువపై 60 శాతానికి సమానమైన, పెనాల్టీ చెల్లించడం ద్వారా ఆస్తులను సరైనవిగి మార్చుకోవచ్చు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు తాజాగా వెబ్ సైట్లో లింక్‌ను ఏర్పాటు చేసింది.
అక్రమ ఆస్తులపై సమాచారం ఇచ్చేందుకు ఫారం-6 ఉపయోగించాలని ఐటీ శాఖకు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. అంతేకాదు ఆన్‌లైన్ ద్వారా వివరాలు తెలియజేసే వ్యక్తులు లేదా సంస్థలు ధ్రువీకరణ కోసం తప్పక డిజిటల్ సంతకం ఉపయోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.