చెల్లింపులన్నీ ఒకే చోట: హెచ్‌డీఎఫ్‌సీ పేజాప్
చెల్లింపులన్నీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 'పేజాప్' పేరుతో కొత్త మొబైల్ అప్లికేషన్‌ని విడుదల చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పురి బుధవారం ఈ అప్లికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి ప్రయోగమని, డిజిటల్ బ్యాంకింగ్‌లో ఓ సరికొత్త విప్లవమని పేర్కొన్నారు.
నాన్ బ్యాంకింగ్ కంపెనీలు ప్రవేశపెట్టిన ప్రీ పెయిడ్ వాలెట్లకు భిన్నంగా 'పేజాప్' సహాయంతో తమ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కస్టమర్లందరూ బ్యాంకుతో అనుసంధానమై ఒకే అప్లికేషన్ ద్వారా నిధుల బదిలీ, మొబైల్ రీచార్జ్, యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ట్రావెల్ బుకింగ్‌లు, మూవీ టికెట్ బుకింగ్‌లు, ఆహారం ఆర్డర్ చేయడం వంటి కార్యకలాపాలన్నీ నిర్వహించుకోవచ్చని చెప్పారు.

పేజాజ్ సహాయంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వినియోగదారులు ఇన్సూరెన్స్ కొనుగోలు, లోన్లకు దరఖాస్తుల వంటివి చేసుకోవడం లాంటి కార్యకలాపాలు కూడా నిర్వహించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంది.
జూన్ 15వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి రానుంది. హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ లావాదేవీల వ్యయాన్ని కూడా డెబిట్‌కార్డు, క్రెడిట్ కార్డు నుంచి చెల్లిస్తారు. పేజాప్ ద్వారా లావాదేవీల కోసం ఇప్పటికే క్లియర్‌ట్రిప్, ఫ్లిప్‌కార్ట్, పివిఆర్, బుక్ మై షో, ఇండి గో వంటి కంపెనీలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications