దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ పెరగడంతో ఈ కామర్స్ కంపెనీలకు లాభాలే లాభాలు. ఈ కామర్స్ కంపెనీలు మరింతగా వ్యాపారాన్ని పెంచుకునేందుకు సీనియర్ స్ధాయి ఉద్యోగులకు సంవత్సరానికి కోటి రూపాయల జీతాన్ని చెల్లించేందుకు వెనకాడటం లేదు.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్, ఓలా, ఉబెర్, క్విక్కర్, యప్ మీ, ఓఎల్ఎక్స్, జంగ్లీ, హంగామా, బుక్ మై షో, జబాంగ్, క్లియర్ ట్రిప్, లెన్స్‌కార్ట్ తదితర సంస్ధలు 500 వరకూ సీనియర్ స్ధాయి ఉద్యోగులకు కోటి రూపాయలకు పైగా వేతనాన్ని ఆఫర్ చేసి విధుల్లోకి తీసుకోనున్నాయి.
ఈ విషయాన్ని ఆర్జీఎఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్చ్, లాంగ్ హౌస్ కన్సల్టింగ్‌తో పాటు మరో ఐదు సెర్చ్ సంస్ధలు విడుదల చేసిన అంచనాల్లో స్పష్టం చేశాయి. గడచిన ఆరు నెలల్లో ఈ కామర్స్ రంగంలోని 100కు పైగా కంపనీలకు చెందిన సీనియర్ స్ధాయి ఉద్యోగులతో మాట్లాడి సేకరించామని ఏబీసీ కన్సల్టెంట్స్ డైరెక్టర్ సిద్దార్ధ రాయ్ సురానా తెలిపారు.

ఈ కామర్స్ కంపెనీలు తమ ఉద్యోగులకు సంవత్సరానికి కోటి రూపాయలు ఇచ్చేందుకు ఏమాత్రం వెనకాడటం లేదని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ కామర్స్ దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగ నియామకాలు కూడా 30 నుంచి 40 శాతానికి పెరిగాయని వెల్లడించారు.
ప్రస్తుతం తమ సంస్ధలో 5 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపిన స్నాప్‌డీల్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ నిగమ్, త్వరలో బిజినెస్ మరింతగా వృద్ధి చెందేందుకు, టీమ్‌లను నడిపించే లీడర్‌షిప్‌ను నియమించనున్నట్లు పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications